Harish Rao Counter | మంత్రి పొంగులేటికి హరీశ్​రావు కౌంటర్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Counter | మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti)కి మాజీ మంత్రి హరీశ్​రావు కౌంటర్​ ఇచ్చారు. అసెంబ్లీలో తన మామపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ మేరకు తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు.

తన మామ భూ కుంభకోణం చేశాడని పొంగులేటి చెప్తున్నారని, కానీ 1995లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓ వ్యక్తి భూమి ఆ భూమి కొనుగోలు చేశారన్నారు. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమికి ఎన్​వోసీ ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్​ హయాంలో తన మామ ఆ భూమిని కొన్నారని చెప్పారు. ఆ భూమి విలువ రూ.15 కోట్లు అని పొంగులేటి చెప్తున్నారని, రూ.50 లక్షలు ఇచ్చి భూమి తీసుకోవాలన్నారు. అసెంబ్లీలో మంత్రి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. మంత్రి కొడుకు, రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బాగోతం కప్పిపుచ్చడానికి తన మీద బురద చల్లుతున్నారని విమర్శించారు.

Harish Rao Counter | సీఎం ఇల్లును ఎందుకు తీసేశారు

22Aతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని హరీశ్​రావు (Harish Rao Counter) తెలిపారు. ఈ విషయాన్ని గతంలో మంత్రి కోమటిరెడ్డి సైతం చెప్పారు. అయితే సభలో పొంగులేటి అబద్దాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22Aలో ఎన్ని ఎకరాలు పెట్టారో సమాధానం చెప్ప లేదన్నారు. 22Aలో తప్పుగా రైతుల భూములు చేర్చినట్టు ఒప్పుకున్నారని తెలిపారు. అయితే క్షమాపణలు చెప్పకుండా తప్పించుకున్నారని విమర్శించారు. సీఎం ఇల్లు కూడా 22Aలో పెడితే, రాత్రికి రాత్రే జాబితా నుంచి తీసేశారని, మరి రైతుల భూములు ఎప్పుడు తీస్తారని ప్రశ్నించారు. 22–ఏ జాబితా ఎప్పటి నుంచో ఉంటే సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఆయన నిలదీశారు. రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నించారు.

 

దీనిని కూడా చదవండి : Minister Ponguleti | ప్రభుత్వ భూమిని మామకు కట్టబెట్టిన హరీశ్​రావు : మంత్రి పొంగులేటి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *