DOST Special Phase | డిగ్రీ అడ్మిషన్లకు ‘స్పెషల్ ఫేజ్’ షెడ్యూల్ విడుదల.. 26 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం!

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్​ ‘స్పెషల్ ఫేజ్’ అడ్మిషన్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి : DOST Special Phase | తెలంగాణలోని(Telangana) ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్​) (DOST) ‘స్పెషల్ ఫేజ్’ (Special Phase) అడ్మిషన్ షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థుల భవిష్యత్తు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ స్పెషల్ ఫేజ్‌ను ప్రవేశపెట్టినట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి, కళాశాల విద్య కమిషనర్ దేవసేన (IAS) ఒక ప్రకటనలో తెలిపారు.

DOST Special Phase | అడ్మిషన్ల తేదీలివే..

జులై 20వ తేదీనుంచి 26 వరకు రూ. 400 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. ​అలాగే వెబ్ ఆప్షన్లను జులై 20 నుండి 27 వరకు పెట్టుకోవచ్చు. ​ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన జులై 27న విశ్వవిద్యాలయ హెల్ప్ లైన్ సెంటర్లలో (UHL) జరుగుతుంది. ​జులై 30న స్పెషల్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు. ​జులై 30 నుండి ఆగస్టు 01 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన విద్యార్థులు జులై 31 నుండి ఆగస్టు 01 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి.

DOST Special Phase | ​పాత విద్యార్థులు..

​గత విడతల్లో దోస్త్​(DOST) లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పటివరకు సీటు పొందని విద్యార్థులు, తమ పాత దోస్త్​ ఐడీ, పిన్  ఉపయోగించి నేరుగా ఈ స్పెషల్ ఫేజ్‌లో పాల్గొనవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు దోస్త్​లో దరఖాస్తు చేసుకోని వారు రూ.400 నమోదు రుసుము చెల్లించి కొత్తగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ​ఇదివరకే సీసీఓటీపీ ద్వారా కళాశాలల్లో చేరి తమ సీటును కన్ఫర్మ్ చేసుకున్న విద్యార్థులు ఈ స్పెషల్ ఫేజ్‌కు అనర్హులని అధికారులు పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి : ‘అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని జెనెరిక్ ఔషధాలపై ఆగస్టు 1 నుంచి రెండేళ్లపాటు 0% సుంకం వర్తిస్తుంది. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *