అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BRS Leaders Attack | రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతుండగా.. మరోవైపు కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ముట్టడికి నాయకులు, కార్యకర్తలు భారీగా వస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌కు రక్షణగా ఉండేందుకు బీఆర్ఎస్ నాయకులు సైతం వస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) నాయకులను అడ్డుకుంటున్నారు. ఎర్రవల్లికి రాకుండా అరెస్ట్ చేస్తున్నారు. ఎర్రవల్లికి వస్తున్న కాంగ్రెస్ నాయకులపై సిద్దిపేట జిల్లా దామరకుంట వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు. కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
BRS Leaders Attack | ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీశ్‌రావు
కాంగ్రెస్ ముట్టడి పిలుపు నేపథ్యంలో అసెంబ్లీ నుంచి కేటీఆర్, హరీశ్‌రావు నేరుగా కేసీఆర్ ఎర్రవల్లి నివాసానికి బయలు దేరారు. కేసీఆర్ మీద కాంగ్రెస్ నాయకులు దాడి చేయడానికి వస్తున్నారని ఎమ్మెల్యేలతో పాటు తరలి వెళ్లారు. ఎంత మందిని పోలీసులని పంపుతారో పంపండి.. ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారో రండి తేల్చుకుంటాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు.
ఇది కూడా చదవండి..: MLA Prashanth Reddy | కేసీఆర్‌పై దాడి చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్: మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి