Telangana Transport Rules | నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనం సీజ్: మంత్రి పొన్నం ప్రభాకర్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Transport Rules | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రవాణా నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  ( Ponnam Prabhakar )అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో (సెక్రటేరియట్) రవాణా శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాల వారీగా 10 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్, రాష్ట్ర స్థాయిలో 2 స్పెషల్ స్క్వాడ్‌లను రంగంలోకి దించుతున్నట్లు మంత్రి వెల్లడించారు.

Telangana Transport Rules | ఫిట్‌నెస్ లేకపోతే సీజే..

పరిమితికి మించి లోడ్‌తో వెళ్లే వాహనాలు (ఓవర్‌లోడింగ్), క్వార్టర్లీ టాక్స్ (త్రైమాసిక పన్ను) చెల్లించనివి, ఫిట్‌నెస్ లేని వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని మంత్రి సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అవసరమైతే వాహనాలను సీజ్ చేయాలన్నారు. చెక్‌పోస్టుల రద్దు తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఉన్న సిబ్బందితోనే తనిఖీలు పెంచాలని ఆదేశించారు.

Telangana Transport Rules | స్కూల్ బస్సులపై స్పెషల్ ఫోకస్..

స్కూల్ బస్సులు, మినీ వ్యాన్‌లకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని, విద్యార్థుల ప్రాణాల రక్షణే తమకు మొదటి ప్రాధాన్యతని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించుకుంటే ఆ వాహనాలను వెంటనే సీజ్ చేయాలని, ఫిట్‌నెస్ లేని బస్సులు నడిపే విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Telangana Transport Rules | ట్యాక్స్ కట్టని వారికి భారీ పెనాల్టీలు..

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న వాహనాలపై నిఘా పెట్టాలని, ట్యాక్స్ కట్టని వారికి భారీ పెనాల్టీలు వేయాలని చెప్పారు. అలాగే, ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని స్లీపర్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలను అస్సలు సహించవద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రవాణా శాఖ ప్రత్యేక సిఎస్ వికాస్ రాజ్, కమిషనర్ ఇలంబర్తి, అడిషనల్ కమిషనర్ రమేష్, జెటిసి చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:  Kishan Reddy Counter | సింగరేణిపై కేటీఆర్​కు కిషన్​రెడ్డి కౌంటర్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *