Mla Rakesh Reddy | హిందువులు ఏకం కాకపోతే పిప్రి మరో కశ్మీర్ అవుతుంది..: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

హిందువులంతా ఏకం కాకపోతే పిప్రి మరో కశ్మీర్ అవుతుందని ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామాన్ని సోమవారం సందర్శించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh Reddy | హిందువులంతా ఏకం కాకపోతే పిప్రి మరో కశ్మీర్(Kashmir) అవుతుందని ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి (MLA Rakesh Reddy) అన్నారు. ఆర్మూర్ (Armoor) మండలం పిప్రి గ్రామాన్ని సోమవారం సందర్శించారు.

Mla Rakesh Reddy | అప్పు అడినందుకే ఇంత ఘోరమా..!

అప్పు ఇచ్చి తిరిగి అడిగినందుకు పిప్రి గ్రామంలో రాజమల్లు ఇల్లుని నిప్పు పెట్టి దహనం చేసిన ఘటనపై ఆయన స్పందించారు. స్వయంగా ఇంటిని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దీని వెనకాల పెద్ద వారి హస్తం ఉందని ఆర్మూర్ నియోజకవర్గంలో హిందువుల ఐక్యత పెరుగుతుంటే చూసి ఓర్వలేక కొన్ని శక్తులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. పదివేల కుటుంబాలు ఉన్న గ్రామంలో ఓ వ్యక్తి ఏకంగా ఇంటికి నిప్పు సజీవంగా మనుషులను దహనం చేయాలని చూడడం క్షమించరాని నేరమన్నారు. పోలీసులు (Armoor Police) సదరు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అలాగే బాధితులకి రెండు రోజుల్లో రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. లేకపోతే నిజామాబాద్ జిల్లాలో ఉన్న హిందువులంతా కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

rakeshrakesh

ఇది కూడా చదవండి: Gas Cylinder Prices | గ్యాస్ ధరల ఎఫెక్ట్.. సిలిండర్‌నే పొయ్యిగా మార్చిన వైనం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *