Munnuru Kapu Elections | బ్యాలెట్ పద్ధతిలో మున్నూరు కాపు కమిటీ ఎన్నికలు నిర్వహిస్తాం

మున్నూరు కాపు సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీ ఎన్నికలు ఈసారి బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తామని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ దేవయ్య తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Munnuru Kapu Elections | మున్నూరు కాపు సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీ ఎన్నికలు(Community Elections) ఈసారి బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తామని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ దేవయ్య తెలిపారు. మంగళవారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం అడహక్ కమిటీని నియమించారు.

Munnuru Kapu Elections | జిల్లా కన్వీనర్​గా గంగయ్య

జిల్లా (Kamareddy) కన్వీనర్​గా హన్మాల పెద్ద గంగయ్య, కో కన్వీనర్​గా బండి ప్రవీణ్, ఎల్లారెడ్డి నియోజకవర్గ కన్వీనర్​గా సంగెం కాశినాథ్, కో కన్వీనర్​గా బండారు చంద్రశేఖర్, రామారెడ్డి మండల కన్వీనర్​గా కాసర్ల లింగం, కామారెడ్డి నియజకవర్గ కన్వీనర్​గా రాజేష్, కో కన్వీనర్​గా కట్లెకుంట సుధాకర్​ను నియమించి నియామకపత్రాలు అందజేశారు.

Munnuru Kapu Elections | జిల్లా నుంచి ఆరుగురు..

రాష్ట్ర, జిల్లా ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా నుంచి ఆరుగురిని తీసుకుంటామని, అందులో ఒక కన్వీనర్, ఐదుగురు కో కన్వీనర్లు ఉంటారని, మండలం, పట్టణాల నుంచి ఆరుగురి చొప్పున తీసుకుంటామన్నారు. వీరి ద్వారా మున్నూరు కాపుల డేటా మొత్తం సేకరిస్తామని, ఆ డేటా ప్రకారం బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. విదేశాలలో ఉన్న వారు కూడా ఓటుహక్కు వినియోగించుకునేలా యాప్ అందుబాటులోకి తెస్తామన్నారు.

Munnuru Kapu Elections | పటేల్​ అనేది గెజిట్​ కావాలి…

పటేల్ అనేది తమకు గెజిట్ కావాలని, తమలో రెడ్డి, రావు ఉండటం వల్ల జనాభా తక్కువగా చూపారని పేర్కొన్నారు. పటేల్ అనేది ఉంటే మున్నూరు కాపుల పూర్తి డేటా తెలుస్తుందన్నారు. ఈ విధానం లేకపోవడం వల్ల గత ప్రభుత్వ హయాంలో 28 లక్షలు ఉన్న జనాభా ఇప్పుడు 13 లక్షలుగా మారిందన్నారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం లేదని, గత ప్రభుత్వం తాము సమగ్ర సర్వేలో పూర్తి వివరాలు సేకరించామని, కులగణంలో ఎవరు పాల్గొనవద్దని చెప్పడంతో ఎవరు పాల్గొనలేదని, దాంతో తమ సంఖ్య తగ్గిందన్నారు.

తమలో కొందరి పేరు చివరన రావు, రెడ్డి ఉండటం వల్ల వారి జాబితాలోకి వెళ్లాయని, అందుకే రావు, రెడ్డి పక్కన పటేల్ చేరిస్తే తమ సంఖ్య పూర్తిగా తెలుస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) తమకు కార్పొరేషన్ ఇస్తామన్నారని, దానికి రూ.వెయ్యి కోట్లు, లేదా రూ.500 కోట్లు నిధులు ఇస్తే జిల్లాలో భవనాలు నిర్మించుకునే అవకాశం ఉంటుందన్నారు. 33 జిల్లాల్లో రెండెకరాల స్థలంలో హాస్టళ్లు నిర్మిస్తామని పత్రాలు ఇచ్చారని, దాన్ని కూడా నెరవేర్చాలని కోరారు.

Kamareddy

ఇది కూడా చదవండి: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *