అక్షరటుడే, ఆర్మూర్: Naikpod Community Support | గాయపడి చికిత్స పొందుతున్న బాలుడిని ఆర్థిక చేయూతనందించి.. తామున్నామంటూ అండగా నిలిచారు ఆదివాసి నాయకపోడ్ కులస్తులు. మోపాల్ మండలం (Mopal Mandal) మంచిప్పలో ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు గాయపడ్డాడు.
Naikpod Community Support | ఏకమైన ఆదివాసి నాయకపోడ్ కులస్తులు..
మంచిప్ప గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసి నాయకపోడ్ కుటుంబానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు గుప్పల అశ్విన్ ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అయితే పేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలుసుకున్న ‘నేను సైతం – నా నాయకపోడ్ చేయూతకై’ ద్వారా వాట్సప్ గ్రూప్లో దాతల ద్వారా విరాళాలు సేకరించారు. ఇలా రూ.43,950 సమకూర్చారు. అనంతరం ఆర్థిక సాయాన్ని ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్ ఆధ్వర్యంలో, మంచిప్ప గ్రామ పెద్దల సమక్షంలో అశ్విన్ తల్లి లతకు అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన దాతలకు, కుల, గ్రామ పెద్దలకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Midday Meal Agency | మధ్యాహ్న భోజన ఏజెన్సీపై కలెక్టర్ ఆగ్రహం.. తొలగించాలని ఆదేశాలు..