Toddy Palm Plantation | ఈతవనాలు పెంచడంతో గీతకార్మికులకు ఉపాధి

పర్యావరణ పరిరక్షణకు ఈతవనాలు దోహదపడతాయని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నంబర్‌–2 అధ్యక్షుడు జి. సత్యనారాయణ గౌడ్‌ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Toddy Palm Plantation | పర్యావరణ పరిరక్షణకు (Environmental Protection) ఈతవనాలు దోహదపడటంతో పాటు.. వాటిపై ఆధారపడే గీత కార్మిక కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తున్నాయని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నంబర్‌–2 అధ్యక్షుడు జి. సత్యనారాయణ గౌడ్‌ అన్నారు. నగరంలో (Nizamabad) కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నంబర్‌–2 ఆధ్వర్యంలో బుధవారం సంఘం అధ్యక్షుడు జి. సత్యనారాయణ గౌడ్‌ నేతృత్వంలో ఈత వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Toddy Palm Plantation | మొక్కలు నాటి..

సత్యనారాయణ గౌడ్​ ఈత మొక్కలు నాటి, వాటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈత చెట్ల పెంపకం, సంరక్షణ ప్రాధాన్యాన్ని వివరించారు. కార్యక్రమానికి ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీధర్‌ (Excise Department), ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నందగోపాల్‌, ఎక్సైజ్‌ ఎస్‌హెచ్‌వో స్వప్న, ఎస్సైలు మల్లేష్‌, గంగాధర్‌, మమతతో పాటు ఎక్సైజ్‌ సిబ్బంది హాజరయ్యారు. ఈతవనాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈత చెట్లు గీత కార్మికుల జీవనాధారంగా ఉన్నాయని, వాటి సంఖ్యను పెంచేందుకు మరిన్ని మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Toddy Palm Plantation | ఈత వనాల సంరక్షణ కోసం..

ఇప్పటికే ఉన్న ఈతవనాలను కాపాడటంతోపాటు కొత్త వనాలను అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్‌ తరాలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈత చెట్లు పచ్చదనాన్ని పెంచడంతోపాటు పర్యావరణ సమతుల్యతకు దోహదపడతాయని, మరోవైపు కల్లు గీత ద్వారా గీత కార్మిక కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నంబర్‌–2 డైరెక్టర్లు శ్రీహరి గౌడ్‌, బాలా గౌడ్‌, గంగాధర్‌ గౌడ్‌, దుర్గా గౌడ్‌తోపాటు సంఘం సభ్యులు, గీత కార్మికులు, ఎక్సైజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : TGSRTCలో కండక్టర్​ పోస్టులు..! 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *