అక్షరటుడే, వెబ్డెస్క్ : Minority Women Financial Aid | మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ (Ajaruddin) అన్నారు. రంగారెడ్డి జిల్లాలో బుధవారం తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) ఛైర్మన్ మొహమ్మద్ ఒబేదుల్లా కోత్వాల్తో ఆర్థిక సాయం, జీవనోపాధి ప్రోత్సాహకాలను మంత్రి పంపిణీ చేశారు.
‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ కింద 278 మంది మైనారిటీ వితంతు మహిళలకు ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున మంత్రి చెక్కులను అందజేశారు. ఈ ఆర్థిక సాయం మహిళలు, వారి కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా బలోపేతం కావడానికి దోహదపడుతుందని మంత్రి తెలిపారు.
Minority Women Financial Aid | జనరేటర్ల అందజేత
మైనారిటీ కమ్యూనిటీకి తుర్క కాశా పునరావాసం పథకం కింద 13 మంది తుర్క కాశా ముస్లిం కమ్యూనిటీ సభ్యులకు రూ.60 వేల 000 విలువైన జనరేటర్, టూల్ కిట్లను మంత్రి పంపిణీ చేశారు. వీటి ద్వారా వారు స్వయం ఉపాధి పొందాలన్నారు. మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ, విస్తృతమైన, వైవిధ్యభరితమైన పారిశ్రామిక ప్రాంతాలు ఉండటం వల్ల రంగారెడ్డి జిల్లా దేశంలోని అత్యంత సంపన్న జిల్లాల్లో ఒకటిగా ఎదిగిందన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దీనిని కూడా చదవండి : Land Prices | గజం భూమి రూ.2.70 లక్షలు.. ఎక్కడో తెలుసా!