అక్షరటుడే, వెబ్‌డెస్క్: PCC Chief | బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao)పై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు.
గాంధీ భవన్లో మంగళవారం మహేశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాలు పడొద్దు, కరువు రావాలని హరీశ్‌రావు పూజలు చేస్తున్నారని ఆరోపించారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వాళ్లకు రాష్ట్రం, ప్రజలు ఏమైపోపోయినా పర్వాలేదన్నారు. అరుంధతి సినిమాలో పశుపతిలా హరీశ్ వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో క్షుద్రపూజలు చేయించారనే ప్రచారం ఇప్పుడు నిజమే అనిపిస్తుందన్నారు.
PCC Chief | అప్పుడు ఎక్కడికి వెళ్లారు
హరీశ్ రావు మార్చి 2న తమిళనాడులోని తిరుచ్చికి, జూన్ 1న కర్ణాటకలోని శివమొగ్గకు వెళ్లారని మహేశ్‌గౌడ్ తెలిపారు. అక్కడకు ఎందుకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి వెళ్లిన సమయంలో కూడా అఘోరీ ఆలయానికి వెళ్లిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. అందరు ప్రజల బాగు కోసం పూజలు చేస్తే.. ఆయన మాత్రం ప్రజలకు కీడు జరగాలని పూజలు చేశారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: MBBS BDS Admission | ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్