అక్షరటుడే, వెబ్‌డెస్క్: MBBS BDS Admission | తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో (కన్వీనర్ కోటా) ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. NEET UG-–2026లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఆగస్టు 5 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు https://tsmedadm.tsche.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది.
సీట్ల మ్యాట్రిక్స్‌ను వెబ్ ఆప్షన్లకు ముందు ప్రకటిస్తామని యూనివర్సిటీ పేర్కొంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే ముందు అర్హతలు, రిజర్వేషన్లు, అవసరమైన ధ్రువపత్రాలు, నిబంధనలను పరిశీలించి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలు, సమాచారం కోసం http://knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని కోరింది.
MBBS BDS Admission | ముఖ్యమైన సూచనలు
విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు అన్ని సర్టిఫికెట్లను తప్పకుండా అప్‌లోడ్ చేయాలి. నమోదు ప్రక్రియ ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ప్రతి రౌండ్ కౌన్సెలింగ్‌కు మళ్లీ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితా ప్రకటిస్తారు. అనంతరం వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్ షెడ్యూల్, సీట్ల మ్యాట్రిక్స్‌ను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు కళాశాలల ప్రాధాన్యత క్రమాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది.
ఇది కూడా చదవండి..: Telangana MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు.. అభిప్రాయ సేకరణ ప్రారంభించిన మంత్రి పొన్నం