KTR on Revanth | కాపీ కొట్టి పాసైన రేవంత్​రెడ్డి : కేటీఆర్

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు సీఎం రేవంత్​రెడ్డి కాపీ కొట్టి పరీక్షల్లో పాస్​ అయ్యారన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR on Revanth | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్​రెడ్డి కాపీ కొట్టి పరీక్షల్లో పాస్​ అయ్యారన్నారు. గోడలకు సున్నాలు వేసుకునే ఆయనకే అంత ఉంటే.. ఇంజినీరింగ్​ విద్యార్థులకు ఎంత ఉండాలన్నారు.

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్​ వేస్ట్​ అన్నారు. వారు సొంతంగా జాబ్​కు అప్లై చేయలేరని, స్కిల్స్​ ఉండటం లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్​ స్పందించారు. తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సొంతంగా ఎలక్షన్ అఫిడవిట్ నింపగలరా అని ప్రశ్నించారు. ఆయన సొంతంగా నింపితే ఏ ఛాలెంజ్‌కైనా తాను సిద్ధమని ప్రకటించారు.

KTR on Revanth | కాంగ్రెస్​కు సమాధి కడుతారు

రేవంత్ రెడ్డి జీవితంలో ఒక పోటీ పరీక్ష అయినా రాశాడా? ఒక ఇంటర్వ్యూకి అటెండ్‌ అయ్యాడా అని కేటీఆర్​ ప్రశ్నించారు. నకల్ కొట్టి పాస్‌ అయి, గోడల మీద సున్నం వేసుకొని బతికిన వ్యక్తి రేవంత్​రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు, ఫ్లై ఓవర్లు, భవనాలు తెలంగాణ ఇంజినీర్లు కట్టారన్నారు. అదేవిధంగా కాంగ్రెస్​ పార్టీకి ఇంజినీరింగ్​ విద్యార్థులు సమాధి కడుతారని హెచ్చరించారు.

KTR on Revanth | రాహుల్​ గాంధీ ఎక్కడ..

గ్రూప్స్​ నోటిఫికేషన్​ రావడం లేదని ఇటీవల ఖమ్మం జిల్లాలో ఓ నిరుద్యోగి వేణు కుమార్​ ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్​ మాట్లాడుతూ.. వేణు కుమార్ రాసింది సూసైడ్ నోట్ కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఛార్జ్ షీట్ అన్నారు. హైదరాబాద్ వచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ ఈరోజు పిల్లలు ఆత్మహత్యాయత్నం చేసుకుంటుంటే ఎందుకు స్పందించడం లేదన్నారు.
ముఖ్యమంత్రి నిరుద్యోగులను ఎండ్రిన్ తాగండి, చావండి అంటుంటే రాహుల్ గాంధీ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం క్రిమినల్ వేస్ట్ అన్నారు.

ఇది కూడా చదవండి..: Unemployed Protest | 19 వేల పోలీస్​ ఉద్యోగాలు భర్తీ చేయాలి.. నిరుద్యోగుల ధర్నా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *