Bandaru Festival Nizamabad | భక్తిశ్రద్ధలతో ‘బండారు’ వేడుక

నగరంలో ఊరపండుగకు సంబంధించి గురువారం బండారు పోసే కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

shashi kiran Mottala

​​అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bandaru Festival Nizamabad | నిజామాబాద్​ నగరంలో (Nizamabad) ఊరపండుగకు సంబంధించి గురువారం బండారు పోసే (Oora Panduga) కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నగరవాసులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.

Bandaru Festival Nizamabad | వివేకానంద చౌరస్తా వద్ద..

వివేకానంద చౌరస్తా వద్ద ఊర పండుగను పురస్కరించుకుని బండారు పోసే కార్యక్రమాన్ని జరిపారు. ​ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కోరడి కిరణ్ మాట్లాడుతూ.. ప్రజలు రోగాల బారిన పడకుండా, అందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

వచ్చే నెల 2వ తేదీన నిర్వహించనున్న ఊర పండుగకు ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్పొరేటర్ మహేందర్ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.

2వ తేదీన జరిగే ఊర పండుగకు ప్రజలు విశేష సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు రామడుగు బాలకిషన్, ఆదె ప్రవీణ్​, అన్నారం జితేందర్, బెల్లాల్ సాయినాథ్, సుంకటి విశాల్, అరుణ్, కొత్మీర్ సతీష్, కోరడి గోపి, అరవింద్, స్థానిక మున్నూరు కాపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy Education | ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార బాధ్యత నాదే: సీఎం రేవంత్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *