అక్షరటుడే, భీమ్ గల్: Manala Mohan Reddy | గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పాపాలే నేడు తెలంగాణ రాష్ట్రానికి శాపాలుగా మారాయని కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి (Vemula Prashanth Reddy) భీమ్‌గల్ అభివృద్ధిపై చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని ఆయన కొట్టిపారేశారు.
Manala Mohan Reddy | అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో భీమ్‌గల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి వైఖరిపై నిప్పులు చెరిగారు. భీమ్ గల్‌లో వెజిటబుల్ మార్కెట్‌కు 2021లో, వంద పడకల ఆసుపత్రికి 2022లో శంకుస్థాపనలు చేశారని మానాల మోహన్‌రెడ్డి గుర్తుచేశారు. ఆయా పనులకు పునాది వేసిన తర్వాత దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కూడా వాటిని ఎందుకు పూర్తి చేయలేకపోయారో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Manala Mohan Reddy | బస్ డిపో ఎన్నికల స్టంట్ మాత్రమే..
ఎన్నికల నోటిఫికేషన్‌కు కేవలం 15 రోజుల ముందు అర్ధాంతరంగా బస్ డిపోను ప్రారంభించి నాటకాలెందుకు ఆడాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే ముసలి కన్నీరు కారుస్తున్నారని, ఆయన చూపించే ప్రజాప్రేమ అంతా బూటకమని విమర్శించారు.
Manala Mohan Reddy | రూ. 28 కోట్లతో అభివృద్ధి పనులు

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక కృషి వల్లనే నేడు భీంగల్‌లో వంద పడకల ఆసుపత్రి పనులు వేగవంతంగా సాగుతున్నాయని, మిగతా అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నానని మానాల తెలిపారు. ఇప్పటికే భీమ్‌గల్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 28 కోట్లతో పనులను ప్రారంభించిందని వెల్లడించారు. మరో రూ.4 కోట్ల విలువైన పనులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పురోగతిలో ఉన్నాయన్నారు. రూ. 15 కోట్ల పనులకు సంబంధించిన పనుల అగ్రిమెంట్లు పూర్తయ్యాయి, ఇవి త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు.అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయకుండా నిర్లక్ష్యం వహించి, ఇప్పుడు కేవలం ప్రజలను పక్కదోవ పట్టించడానికి ప్రశాంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Enumeration Forms | ఎన్యుమరేషన్ ఫారాలను త్వరితగతిన సమర్పించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి