Jupally Resignation Challenge | రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా.. మరోసారి జూపల్లి సవాల్​

మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. అప్పులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jupally Resignation Challenge | మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఈరోజు తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కేటీఆర్​, హరీశ్​రావు వస్తానంటే సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వస్తానని తెలిపారు.

బీఆర్​ఎస్​ హయాంలో చేసిన అప్పులపై గురువారం చర్చకు వస్తానని జూపల్లి కృష్ణారావు సవాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే చర్చకు వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్​రావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హరీశ్​రావు మాట్లాడుతూ జూపల్లిపై తీవ్ర విమర్శలు చేశారు. సవాల్​ విసిరి తోక ముడిచారన్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సీఎల్పీ కార్యాలయంలో జూపల్లి మాట్లాడారు.

Jupally Resignation Challenge | నా మాటలకు కట్టుబడి ఉన్న

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అప్పుల గురించి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. ఆ అప్పుల గురించి అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్, హరీశ్‌రావు మాట్లాడారన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కాదని, తాను చెప్పిన లెక్కలు తప్పయితే.. తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

Jupally Resignation Challenge | కేసీఆర్​తో చెప్పించాలి

పోలీసులు హరీష్ రావును ఎందుకు అరెస్ట్ చేసారో తనకు తెలియదని జూపల్లి తెలిపారు. హరీష్ రావు గన్ పార్క్ వద్దకు వస్తున్న అనడంతో తాను అక్కడకు వెళ్లానని చెప్పారు. అప్పుల విషయంలో తన లెక్కలు తప్పని కేసీఆర్‌తో చెప్పించాలని, కాళేశ్వరం కార్పొరేషన్, మిషన్ భగీరథ అప్పులపై సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్​ చేశారు. కార్పొరేషన్​ల పేరిట తెచ్చిన అప్పులను తాము తీసుకు రాలేదని బీఆర్​ఎస్​ నాయకులు చెబుతున్నారని జూపల్లి అన్నారు. మరీ బీఆర్​ఎస్​ హయాంలో వాటికి ప్రభుత్వ ఖజానా నుంచి వడ్డీలు ఎందుకు కట్టారని ప్రశ్నించారు.

దీనిని కూడా చదవండి : DSP Bheem Reddy ACB | డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిపై ఏసీబీ పంజా: భారీగా అక్రమాస్తుల గుర్తింపు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *