PCC Chief Mahesh Goud | పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు : పీసీసీ చీఫ్​

పార్టీ లైన్ దాటితే క్రమ శిక్షణ చర్యలు తప్పవని పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ స్పష్టం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: PCC Chief Mahesh Goud | పార్టీ లైన్ దాటితే క్రమ శిక్షణ చర్యలు తప్పవని పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ తెలిపారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరమని.. తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులిచ్చామన్నారు.

కొండా సురేఖ కుమార్తె ఇటీవల మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్​రెడ్డితో పాటు మంత్రి పొంగులేటిఐ ఆమె ఆరోపణలు చేశారు. సుష్మిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె తల్లి కొండా సురేఖకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఈ విషయమై నిజామాబాద్​లో పీసీసీ చీఫ్​ స్పందించారు. సురేఖ మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి వివరణ కోరామని చెప్పారు. చిన్నారెడ్డి చాలా సీనియర్ నాయకులు అని.. ఆయన అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే దానిపై కూడా వివరణ అడిగామని తెలిపారు. పార్టీ లైన్ దాటితే క్రమ శిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చాక ఏం చేయాలో ఆలోచిస్తామని తెలిపారు.

PCC Chief Mahesh Goud | అభ్యర్థిని అధిష్టానం ప్రకటిస్తుంది

వచ్చే ఎన్నికల్లో పరకాల కాంగ్రెస్​ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి అని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు తాను పోటీ చేస్తానని కొండా సుష్మిత అన్నారు. ఈ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్​ స్పందిస్తూ.. ఎమ్మెల్యేల అభ్యర్థులను నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టానం అని స్పష్టం చేశారు. ఎవరు చెప్పినా అది చెల్లదన్నారు. పచ్చ కాంగ్రెస్​ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాక పచ్చ, ఎరుపు, నలుపు అనే తేడా ఉండదని అన్నారు. అందరం కాంగ్రెస్ పార్టీ నాయకులమేనని స్పష్టం చేశారు.

PCC Chief Mahesh Goud | 22ఏ విషయంలో తప్పులు జరిగాయి

రాష్ట్రంలో పలు భూములను 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టిన విషయం తెలిసింద. ఈ వ్యవహారంలో కింది స్థాయిలో కొన్ని తప్పిదాలు జరిగాయని పీసీసీ చీఫ్ అంగికరించారు. 22A అంశం పై హరీశ్ రావు రాహుల్ గాంధీకి లేఖ రాసి కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కింది స్థాయిలో జరిగిన తప్పిదాలను గుర్తించి, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Telangana Weather | వర్షాలకు బ్రేక్​.. రాష్ట్రంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *