Telangana Weather | వర్షాలకు బ్రేక్​.. రాష్ట్రంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Weather | రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొన్నారు.

తెలంగాణ (Telangana)లోని పలు ప్రాంతాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే చాలా చోట్ల వాతావరణం పొడిగా ఉంటుంది. నేటి నుంచి ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ పెరుగుతాయి. దక్షిణ, తూర్పు తెలంగాణలో 35-37° డిగ్రీల టెంపరేచర్​ నమోదు అయ్యే అవకాశం ఉంది.

Telangana Weather | 22 నుంచి భారీ వర్షాలు

రెండు రోజుల విరామం తర్వాత ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 22 నుంచి 28 వరకు వర్షాలు పడుతాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో అల్ప పీడన ప్రభావం అధికంగా ఉంటుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. హైదరాబాద్‌ నగరంలో రానున్న రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి.

ఇది కూడా చదవండి..: Harish Rao Letter Section 22A | 22A ల్యాండ్ కుంభకోణంపై హరీశ్ రావు ఫైర్​..రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *