అక్షరటుడే, వెబ్‌డెస్క్: Azharuddin Kodandaram Oath | తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ఎం. కోదండరామ్, మొహమ్మద్ అజారుద్దీన్.. నేడు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జీవోను జారీ చేసింది.
Azharuddin Kodandaram Oath | హాజరుకానున్న సీఎం
ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరామ్, అజారుద్దీన్ తో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరుకానున్నారు.
ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడిగా పేరుపొందారు. సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన చురుకైన పాత్ర ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించింది.
ఇక మొహమ్మద్ అజారుద్దీన్, భారత క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్‌గా విశేష గుర్తింపు పొందారు. క్రీడా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆయన, తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా సేవలో కొనసాగుతున్నారు.

Azharuddin Kodandaram Oath | రాజకీయంగా ప్రాధాన్యం
గవర్నర్ కోటాలో వీరి నియామకం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు ఉద్యమ నేతకు, మరోవైపు క్రీడా రంగానికి చెందిన వ్యక్తికి అవకాశమివ్వడం ద్వారా ప్రభుత్వం విభిన్న రంగాలకు ప్రాతినిధ్యం కల్పించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రమాణ స్వీకారం అనంతరం ఇద్దరూ శాసన మండలిలో తమ బాధ్యతలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషిస్తామని ఇద్దరూ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Mehreen Pirzada Wedding | నటి మెహ్రీన్ అభిమానులకు సర్‌ప్రైజ్.. వ్యాపారవేత్త అర్ష్ ఔలాఖ్ను వివాహం చేసుకున్న బ్యూటీ!

