తెలంగాణRTC Driver Removal | వడ్లు కొనమన్నందుకు.. ఆర్టీసీ డ్రైవర్​ను విధుల్లో నుంచి తీసేశారు!

RTC Driver Removal | వడ్లు కొనమన్నందుకు.. ఆర్టీసీ డ్రైవర్​ను విధుల్లో నుంచి తీసేశారు!

వడ్లు కొనమని చెప్పినందుకు ఓ ఆర్టీసీ డ్రైవర్​ను అధికారులు విధుల్లో నుంచి తొలగించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Driver Removal | వడ్లు కొనమని చెప్పినందుకు ఓ ఆర్టీసీ డ్రైవర్ (RTC Driver)​ను అధికారులు విధుల్లో నుంచి తొలగించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్​ పాలనలో రైతుల సమస్యపై మాట్లాడినందుకు ఓ డ్రైవర్​ను విధుల్లోకి రావొద్దని అధికారులు ఆదేశించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

దేశంలో ఇటీవల పెట్రోల్​, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ధరల పెంపునకు నిరసనగా జగిత్యాల జిల్లా (Jagtial District) కేంద్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ కుమార్​ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్​ నాయకులు (Congress Leaders) ధర్నా చేశారు. అయితే ఆ సమయంలో ఆ మార్గంలో బస్సు నడుపుతున్న అశోక్​ అనే డ్రైవర్​ తనకు తెలిసిన వ్యక్తిని పలకరించాడు. ఎందుకు ధర్నా చేస్తున్నారని మాములుగానే అడిగాడు. అయితే పెట్రోల్​, డీజిల్ రేట్లు పెరగడంతో ధర్నా చేస్తున్నామని ఆయన చెప్పారు. అయితే ముందు వడ్లు కొనాలని, తర్వాత ధరల గురించి ధర్నాలు చేయండని ఆయన తనకు తెలిసిన వ్యక్తికి సలహా ఇచ్చాయి.

RTC Driver Removal | వీడియో వైరల్

డ్రైవర్​ అశోక్​ మాట్లాడిన మాటలు సోషల్​ మీడియాలో వైరల్ అయ్యాయి. ముందు రైతుల వడ్లు, మక్కల గురించి పట్టించుకోండి.. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై తర్వాత మాట్లాడొచ్చు అని ఆ వీడియోలో ఉంది. దీంతో అధికారులు ఆయనపై చర్యలు చేప్టటారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయం నుంచి అశోక్​కు రిమూవల్ లెటర్ జారీ చేసి, డ్యూటీకి రావద్దని సూచించినట్లు సమాచారం.

RTC Driver Removal | బాధితుడి ఆవేదన

ఆర్టీసీ డ్రైవర్​ అశోక్​ మంగళవారం ఉదయం విధులకు హాజరు కావడానికి వెళ్లగా డిపో మేనేజర్​ డ్యూటీ కేటాయించలేదు. ఆర్​ఎం ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్లు చెప్పారు. దీంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తికి కాదన్నారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడ ఉండటంతో క్యాజువల్​గా మాట్లాడనని చెప్పారు. తాను ఏ రాజకీయ పార్టీని, నాయకుడిని విమర్శించలేదని.. రైతుల గురించి మాత్రమే మాట్లాడానన్నారు. తనను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై మాజీ మంత్రి గంగుల కమలాకర్​ స్పందించారు. జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. లేదంటే ఆర్ఎం ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Ramchander Rao Criticism| బీజేపీలో చేరిన మైనారిటీ నేతలు.. సాదరంగా ఆహ్వానించిన రామచందర్ రావు

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Stock Market india | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. నష్టాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market india | దేశీయ స్టాక్ మార్కెట్...

హైదరాబాద్‌ టెక్‌ అద్భుతం.. గాల్లోకి లేవనున్న భారీ కార్గో విమానం ‘జెన్ #2’

హైదరాబాద్‌కు చెందిన డీప్‌-టెక్ ఏరోస్పేస్ స్టార్టప్ 'బ్లూజే ఏరోస్పేస్' (BluJ Aerospace)...

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సరికొత్త హైబ్రిడ్, రిమోట్ వర్క్ విధానాలు షురూ

ప్రముఖ స్టాక్‌బ్రోకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తన సిబ్బంది కోసం సరికొత్త...

Armoor Officials Transfer | ఆర్మూర్ బల్దియాలో ముగ్గురు అధికారుల బదిలీ..

అక్షరటుడే, ఆర్మూర్: Armoor Officials Transfer | ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో...