అక్షరటుడే, ఇందూరు: Ekadashi | హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Surya Narayana Gupta) పేర్కొన్నారు. ఆషాడశుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) పురస్కరించుకుని నగరంలోని(Nizamabad) నాందేవ్ వాడ, బ్రహ్మపురిలో ఉన్న విఠలేశ్వర ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Ekadashi | మహావిష్ణువు రూపం విఠలేశ్వరుడు..
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహావిష్ణువు రూపం విఠలేశ్వరుడు అని పేర్కొన్నారు. ఏకాదశి నుంచి మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయన్నారు. ఉపవాసం చేసి మహావిష్ణువును ఆరాధిస్తే పాపాలు తొలిగి, ఆయురారోగ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం అన్నారు. మహారాష్ట్రలో విఠలేశ్వరుడు, రుక్మిణి దేవిని అత్యధికంగా కొలుస్తారని, ఇందూరులోనూ మహారాష్ట్ర సాంప్రదాయం పాటిస్తారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు ఎర్రం సుధీర్, జగదీష్ కులకర్ణి, నాగోళ్ల లక్ష్మీనారాయణ, మల్కాయి మహేందర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: #Breaking news : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా