Bakrid Security Measures | బక్రీద్​ను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలి.. డీజీపీ సీవీ ఆనంద్​

shashi kiran Mottala

అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Bakrid Security Measures | బక్రీద్​ను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్​ (dgp cv anand) పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాల పోలీసు( nizamabad police) ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు.

Bakrid Security Measures | కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు..

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ముఖ్యంగా ప్రార్థనా స్థలాలు, ఈద్గాలు, మసీదులు, ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పండుగ రోజున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి, వాహన రాకపోకలను సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఈద్గాల వద్ద పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు, అత్యవసర సేవలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సామాజిక మాద్యమాల ద్వారా ఎలాంటి అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు లేదా వదంతులు వ్యాప్తి చెందకుండా సైబర్ మానిటరింగ్‌ను మరింత బలోపేతం చేయాలని డీజేపీ ఆదేశించారు.

Bakrid Security Measures | సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..

పండుగ విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలలని డీజీపీ సూచించారు. ఎక్కడైనా చిన్న ఘటన జరిగిన వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. వీసీలో జిల్లా నుండి సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya), అదనపు డీసీపీ అడ్మిన్ ఎన్.శుభం ప్రకాష్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్, పశు సంవర్ధక శాఖ అధికారి గంగాధర్, ఆర్మూర్ డీఏవో అచ్యుత్ రెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసీపీ లు ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Bandi Bhagirath Case | నాకు రెండు రోజుల సమయం కావాలి.. పోలీసులకు బండి భగీరథ్​ లేఖ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *