Hyderabad Congress BJP | కాంగ్రెస్​ వర్సెస్​ బీజేపీ.. హైదరాబాద్​లో ఉద్రిక్తత

హైదరాబాద్​లో కాంగ్రెస్​, బీజేపీ నాయకులు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Congress BJP | హైదరాబాద్​ (Hyderabad)లో కాంగ్రెస్​, బీజేపీ నాయకులు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్​ నాయకులు బీజేపీ ఆఫీస్​ ముట్టడికి పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు గాంధీ భవన్​ వద్ద ఆందోళన చేశారు.

నాంపల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నించగా… బీజేపీ ఆఫీస్ ముందు కర్రలు పట్టుకొని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్​ నేతలపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. రెండు పార్టీల నాయకులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

Hyderabad Congress BJP | గాంధీభవన్ దగ్గర..

గాంధీ భవన్​ను ముట్టడికి బీజేపీ నేతల ప్రయత్నం చేశారు. కాంగ్రెస్​ పార్టీ ప్లెక్సీలు చించేశారు. బీజేపీ నేతలు – పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి భారతదేశం అంటే ద్వేషం అన్నారు. ఆ పార్టీ అరాచకాన్ని కోరుకుంటోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని భావిస్తోందన్నారు. ప్రధాన మంత్రి నివాసం వద్ద నేపాల్ తరహా పరిస్థితులను సృష్టించాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేపట్టిన భారత వ్యతిరేక చర్యకు నిరసనగా, తాను కార్యకర్తలతో కలిసి శాంతియుత నిరసన చేపడితే కాంగ్రెస్​ ప్రభుత్వం అడ్డుకుందన్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Murder | హత్య చేసి.. ఇన్​స్టాలో లైవ్​ పెట్టిన యువకుడు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *