అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Murder | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం నిందితుడు ఇన్స్టాలో లైవ్ పెట్టి తాను హత్య చేశానని చెప్పడం గమనార్హం.
నందనవనం సూరిని అఫ్రోజ్ అనే వ్యక్తి సోమవారం రాత్రి హత్య చేశాడు. సూరి గతంలో తన భార్య, బావమరిది సల్మాన్ను హత్య చేశాడు. దీంతో అతడిపై వరంగల్, హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్‌ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. రౌడీ షీట్ ఉండటం, నేర చరిత నేపథ్యంలో పోలీసులు అతడిని నగర బహిష్కరణ కూడా చేశారు. అయితే సోమవారం రాత్రి సూరి నందనవనంలోని తన ఇంటికి వచ్చాడు.
Hyderabad Murder | పాత కక్షలతో..
తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకల కోసం సూరి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అఫ్రోజ్ (సల్మాన్ సోదరుడు) అక్కడకు వచ్చాడు. సూరి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి కత్తితో పొడిచి చంపాడు. అనంతరం అఫ్రోజ్ ఇన్స్టాలో లైవ్ పెట్టాడు. స్నేహితులతో మాట్లాడుతూ.. సూరిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అంతేగాకుండా ఆ విషయాన్ని గర్వంగా చెప్పడం గమనార్హం. పోలీసులను సైతం దుర్భాషలాడాడు. పోలీసులు తనను పట్టుకోలేరని ఛాలెంజ్ విసిరాడు.
Hyderabad Murder | పెరుగుతున్న నేర ప్రవృత్తి
ప్రస్తుతం యువతలో నేర ప్రవృత్తి పెరుగుతుంది. అఫ్రోజ్ ఓ వ్యక్తిని హత్య చేశాక.. ఎలాంటి భయం, పాశ్చాత్తాపం లేకుండా లైవ్లో మాట్లాడటం గమనార్హం. తాను హత్య చేశానని మిత్రులతో గర్వంగా చెబుతుండగా.. మిగతా వారు సైతం అతడిని ప్రోత్సహించారు. “నువ్వు చేస్తావని ముందే తెలుసని’’ మరో యువకుడు లైవ్లో మాట్లాడాడు. ప్రస్తుతం యువతలో పెరుగుతన్న హింసాత్మక ధోరణికి ఇది అద్దం పడుతోంది.
ఇది కూడా చదవండి..: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. ఎలా అప్లై చేయాలంటే?