Stock Market Today | హెవీవెయిట్ స్టాక్స్‌లో అమ్మకాలు.. రెండోరోజూ నష్టాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌లో హెవీవెయిట్ స్టాక్స్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐలలో అమ్మకాల ఒత్తిడితో ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 442 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్లు కోల్పోయాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Today | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో ముడి చమురు ధరలు అదుపులోకి రావడం లేదు. దీంతో ద్రవ్యోల్బణ భయాలు పెరుగుతుండడం మార్కెట్ సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచుతోంది. దిగ్గజ బ్యాంకుల షేర్లతోపాటు రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి షేర్లలో అమ్మకాల ఒత్తిడితో ప్రధాన సూచీలు వరుసగా రెండోరోజూ నేలచూపులు చూశాయి.

Stock Market Today | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 59 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 104 పాయింట్లు పెరిగింది. అయితే ఇంట్రాడే గరిష్టాల వద్ద నిలదొక్కుకోలేక 416 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 46 పాయింట్లు పెరిగినా తిరిగి అమ్మకాల ఒత్తిడి కారణంగా 127 పాయింట్లు తగ్గింది. చివరికి సెన్సెక్స్ 238 పాయింట్ల నష్టంతో 77,470 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 24,187 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Today | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ ఈలో నమోదైన కంపెనీలలో 2,188 కంపెనీలు లాభపడగా 2,021 స్టాక్స్ నష్టపోయాయి. 190 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 131 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 90 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 21 స్టాక్ లాభపడగా.. 9 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ 2.07 శాతం, ఇండిగో 1.57 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.42 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.32 శాతం, ఎం అండ్ ఎం 1.18 శాతం లాభపడ్డాయి.

Top Losers : హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ 2.08 శాతం, రిలయన్స్ 1.48 శాతం, ఎస్బీఐ 1.48 శాతం, టీసీఎస్ 1.32 శాతం, ఇన్ఫోసిస్ 1.24 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Millworks Technologies IPO | అదరగొట్టిన ఐపీవో.. లిస్టింగ్ రోజే రెట్టింపైన సంపద

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *