Aug 10 Market Analysis | లాభాల్లో గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు కూడా పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aug 10 Market Analysis | పశ్చిమాసియాలో శాంతి చర్చలలో పురోగతి లేకపోవడంతో చమురు ధరలలో అస్థితర కొనసాగుతోంది. అయితే గత నెలలో అమెరికా జాబ్ డాటా బలహీనంగా రావడాన్ని వాల్‌స్ట్రీట్ పాజిటివ్‌గా తీసుకుంది.

గత నెలలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా ఉద్యోగాలను కోల్పోవడంతో ఫెడరల్ రిజర్వ్ వచ్చే సమావేశంలో వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. దీంతో శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. దీని ప్రభావంతో సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి.

Aug 10 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 1.30 శాతం, ఎస్ అండ్ పీ 0.62 శాతం లాభపడగా.. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.09 శాతం నష్టంతో ఉంది.

Aug 10 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.30 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.17 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.68 శాతం లాభపడ్డాయి.

Aug 09 Horoscope | చందుని సంచారం..హర్ష–వజ్ర యోగాల కలయికతో నేటి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయంటే!

Aug 10 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8.10 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.14 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 2.04 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.04 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.87 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.84 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.22 శాతం లాభంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.12 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 480 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 235 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు బలహీనపడి 95.20 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.70 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.66 వద్ద ఉన్నాయి.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 84.15 డాలర్ల వద్ద ఉంది.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *