అక్షరటుడే వెబ్‌డెస్క్: Gold Loan Co Lending | గ్రామీణ , మూడో శ్రేణి (Tier-3) పట్టణాల్లో పసిడి రుణాలను మరింత విస్తరించేందుకు ఆరెంజ్ రిటైల్ ఫైనాన్స్ (ORFIL) కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన శ్రీరామ్ ఫైనాన్స్‌తో ఆరెంజ్ రిటైల్ ఫైనాన్స్ చేతులు కలిపింది. తమిళనాడులో గోల్డ్ లోన్ల జారీ కోసం ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రూ. 100 కోట్ల వరకు కో-లెంటింగ్ (సహ-రుణ) ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
Gold Loan Co Lending | ఒప్పందం విశేషాలు..
ఈ కో-లెంటింగ్ కార్యక్రమంలో ఆరెంజ్ రిటైల్ ఫైనాన్స్ (ORFIL) , శ్రీరామ్ ఫైనాన్స్ మధ్య 20:80 నిష్పత్తిలో నిధుల భాగస్వామ్యం ఉంటుంది. అంటే 20 శాతం ఆరెంజ్ రిటైల్ భరిస్తే, 80 శాతం నిధులను శ్రీరామ్ ఫైనాన్స్ సమకూరుస్తుంది. కస్టమర్ల సౌలభ్యం కోసం రెండు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 12 నెలల వరకు గడువుతో ఏకమొత్తంగా (Bullet repayment) లేదా 36 నెలల వరకు ఈఎంఐ (EMI) పద్ధతిలో రుణం తీర్చుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు.
Gold Loan Co Lending | స్థానిక మార్కెట్లే లక్ష్యంగా..
తమిళనాడులోని ( Tamil Nadu ) గ్రామీణ, టైర్-3 ప్రాంతాల్లో ఆరెంజ్ రిటైల్ ఫైనాన్స్‌కు ఉన్న బలమైన నెట్‌వర్క్, శ్రీరామ్ ఫైనాన్స్ ఆర్థిక స్థోమత కలగలిసి మారుమూల ప్రాంతాలకూ రుణాలు సులభంగా అందేలా ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోనూ ఉనికి ఉన్న ఆరెంజ్ రిటైల్ ఫైనాన్స్.. భవిష్యత్తులో తమ సెక్యూర్డ్ లోన్ల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలని చూస్తోంది. ఈ ఒప్పందం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులు, రైతులకు పసిడి రుణాలు మరింత సులభంగా లభించనున్నాయి.
ఇది కూడా చదవండి: Wife Suicide Case | భార్య ఆత్మహత్య కేసులో భర్తకు ఐదేళ్ల జైలుశిక్ష