అక్షరటుడే వెబ్‌డెస్క్: Rajnath Singh Comments | ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఈ నిరసనలు ఆందోళనకరమని, రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు విద్యార్థులను సాధనంగా వాడుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రధాని మోదీ ప్రభుత్వం పూర్తి కృతనిశ్చయంతో ఉందని, వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత తమపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
Rajnath Singh Comments | పార్లమెంట్‌లో చర్చించాలి..
ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్ష నేతలు సృష్టించిన ఈ కృత్రిమ నిరసనలు కేవలం ఒక విఫల ప్రయత్నం మాత్రమేనని రాజ్‌నాథ్ సింగ్ కొట్టిపారేశారు. సమస్యలను పార్లమెంట్‌లో కాకుండా వీధుల్లో పరిష్కరించాలని చూడడం ప్రతిపక్షాలు చేస్తున్న అనుచిత ప్రయత్నమని మండిపడ్డారు.
Rajnath Singh Comments | వర్షాకాల సమావేశాలను సద్వినియోగం..
నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ వివాదంపై చర్చించి, విద్యార్థులకు న్యాయం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. నిజంగా ప్రతిపక్షాలకు విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన ఉంటే, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అడ్డంకులు సృష్టించవద్దని హితవు పలికారు. సభ వేదికగా అన్ని అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలకు సూచించారు.
केंद्रीय रक्षा मंत्री राजनाथ सिंह का छात्रों के आंदोलन पर बयान, विपक्ष पर गुमराह करने और आंदोलन को राजनीतिक रंग देने का आरोप
कहा- ऐसे मुद्दों पर सड़क नहीं, संसद में चर्चा होनी चाहिए…#RajnathSingh #NEET #StudentProtest #LokSabha #Parliament #Politics #Youth #MonsoonSession pic.twitter.com/TTPQpseHEs
— Shailendra Singh (@Shailendra97S) July 22, 2026
ఇది కూడా చదవండి: NEET Protest Telangana | ‘నీట్’ విషయంలో కేంద్ర ప్రభుత్వానివి తప్పుడు విధానాలు..: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి