Modular Workspace | ‘ఆఫీసుల డిజైన్లలో సరికొత్త విప్లవం.. ‘వర్క్‌స్కేప్స్’ను లాంఛ్ చేసిన ఇంటీరియో బై గోద్రెజ్

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆఫీసుల రూపురేఖలను సులభంగా మార్చుకునేలా ఇంటీరియో బై గోద్రెజ్ (Interio by Godrej) సంస్థ సరికొత్త మోడ్యులర్ వర్క్‌‌ప్లేస్ సొల్యూషన్స్ కేటగిరీని మార్కెట్లోకి తెచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Modular Workspace | మారుతున్న కాలానికి అనుగుణంగా ఆఫీసుల రూపురేఖలను సులభంగా మార్చుకునేలా ఇంటీరియో బై గోద్రెజ్ (Interio by Godrej) సంస్థ సరికొత్త మోడ్యులర్ వర్క్‌‌ప్లేస్ సొల్యూషన్స్ కేటగిరీని మార్కెట్లోకి తెచ్చింది. ‘వర్క్‌స్కేప్స్’ (Workscapes) పేరుతో ఈ కొత్త శ్రేణి ఉత్పత్తులను ఆవిష్కరించినట్లు సంస్థ ప్రకటించింది. స్థిరమైన లేఅవుట్ల ఇబ్బంది లేకుండా, ఆఫీసు అవసరాలకు తగినట్లుగా సులభంగా సర్దుబాటు చేసుకునే ఫర్నిచర్ , ఇతర సామాగ్రిని ఈ కేటగిరీ కింద అందిస్తున్నారు.

 Modular Workspace | ‘వర్క్‌స్కేప్స్’ ప్రత్యేకతలు..

భవనంలో ఎలాంటి నిర్మాణపరమైన మార్పులు చేయకుండానే.. ఆఫీసు అవసరాలకు తగినట్లుగా వీటిని సర్దుబాటు చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు లేదా వేరే రూపంలోకి మార్చుకోవచ్చు. కొలాబరేషన్ టేబుల్స్, ప్రైవసీ సొల్యూషన్స్, మొబైల్ మార్కర్‌బోర్డ్స్, స్పేస్ డివైడర్స్, పవర్ సొల్యూషన్స్, స్టోరేజ్ ఎలిమెంట్స్, మీటింగ్ టూల్స్ , సీటింగ్ ఏర్పాట్లు వంటివి ఇందులో ఉన్నాయి. ఏకాగ్రతతో కూడిన పని (focused work), చర్చలు, హైబ్రిడ్ మీటింగ్‌లు , కాన్ఫరెన్స్‌ల వంటి వివిధ రకాల ఆఫీస్ అవసరాలకు ఈ ఉత్పత్తులు చక్కగా సరిపోతాయి.

Modular Workspace | వ్యాపార లక్ష్యాలు..

2026-27 ఆర్థిక సంవత్సరంలో (FY27) ఇంటీరియో బై గోద్రెజ్ ( Interio by Godrej ) బీటూబీ (B2B) , ఇన్‌స్టిట్యూషనల్ వ్యాపారంలో ఈ ‘వర్క్‌స్కేప్స్’ కేటగిరీ ద్వారా ఏకంగా 10 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ సందర్భంగా ఇంటీరియో బై గోద్రెజ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సమీర్ జోషి మాట్లాడుతూ.. ఆధునిక ఆఫీసుల అవసరాలకు తగ్గట్టుగా ఫ్లెక్సిబిలిటీని అందించేలా దీన్ని డిజైన్ చేశామన్నారు. పూర్తిగా మన దేశంలోనే (ఇండిజెనస్ డిజైన్) రూపుదిద్దుకున్న ఈ ఉత్పత్తులు భారతీయ వ్యాపార సంస్థల ఆధునిక అవసరాలను తీరుస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  Wife Suicide Case | భార్య ఆత్మహత్య కేసులో భర్తకు ఐదేళ్ల జైలుశిక్ష

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *