అక్షరటుడే వెబ్‌డెస్క్: CJP Gyanesh Kumar | భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో తన పదవికి రాజీనామా చేయాలని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) డిమాండ్ చేసింది. ఆయన గడువులోగా వైదొలగకపోతే దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. అంతేకాకుండా, రాబోయే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని డిమాండ్ చేసింది.
CJP Gyanesh Kumar | క్రిమినల్ చర్యలు తీసుకోవాలని..
న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, కో-కన్వీనర్ సౌరవ్ దాస్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సీఈసీ రాజీనామాతో పాటు, ఆయనతో పాటు ఈ నిర్ణయాల వెనుక ఉన్నవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, రాబోయే ఎన్నికలను వాయిదా వేయాలని మూడు ప్రధాన డిమాండ్లను వెలిబుచ్చారు. ఇదే సమయంలో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను 2025 నాటి ఓటర్ల జాబితా స్థితికి వెనక్కి తీసుకోవాలని, ఎస్ఐఆర్ ఫైళ్లను సుప్రీంకోర్టు నేతృత్వంలోని కమిటీ ఆధీనంలో ఉంచాలని కోరారు. అలాగే, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన ప్రస్తుత చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
CJP Gyanesh Kumar | ఈసీ వివరణ..
మరోవైపు, గత 10 నెలల్లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలుమార్లు అభ్యంతరాలు తెలిపారంటూ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఇటీవల ఓ నివేదికను వెలువరించింది. అయితే ఈ నివేదికను ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ఎస్ఐఆర్ సహా అన్ని కీలక నిర్ణయాలను పూర్తి కమిషన్ ఏకగ్రీవంగా ఆమోదించిందని స్పష్టం చేసింది. చర్చల సమయంలో కమిషనర్లు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు వ్యక్తంచేయడం సాధారణ అంతర్గత ప్రక్రియలో భాగమేనని ఈసీ తేల్చిచెప్పింది.
VIDEO | Delhi: Addressing a press conference, Cockroach Janata Party founder Abhijeet Dipke, says, “If within 48 hours Gyanesh Kumar doesn’t resign, the Cockroach Janata Party will start a nationwide agitation. We won’t step back till the time Gyanesh Kumar resigns.”#CJP #CEC… pic.twitter.com/hAkRfX9ar2
— Press Trust of India (@PTI_News) September 24, 2026
ఇది కూడా చదవండి: Vijaya Lakshmi Hospital | బండారి విజయలక్ష్మి హాస్పిటల్లో అన్నదానం..