అక్షరటుడే వెబ్‌డెస్క్: CJP Protest | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ( Dharmendra Pradhan )తన పదవికి రాజీనామా చేసే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు కోసమే తాము ఈ పోరాటం చేస్తున్నామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. విద్యా వ్యవస్థ క్షీణించడం వల్లే దేశంలో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అందుకే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొందరికి భయపడి ఇప్పుడు మౌనంగా ఉంటే దేశం భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని హెచ్చరించారు.
CJP Protest | జంతర్‌మంతర్ వద్దే చర్చలు..
యువత మద్దతుతోనే ఇన్ని రోజులుగా దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్నట్లు దీప్కే తెలిపారు. చర్చల కోసం తాము కేంద్రమంత్రి జేపీ నడ్డా నివాసానికి వెళ్లే ప్రసక్తే లేదని, చర్చలు జరగాల్సి వస్తే తటస్థ వేదిక అయిన జంతర్‌మంతర్ వద్దే జరగాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించడమే ఈ సమస్యకు సరైన పరిష్కారమని పేర్కొన్నారు. మరోవైపు, విద్యార్థులపై దిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.
CJP Protest | భారీగా భద్రతా బలగాల మోహరింపు..
సీజేపీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో.. దిల్లీలోని జంతర్‌మంతర్ వద్దకు వేల సంఖ్యలో యువకులు తరలివస్తున్నారు. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.
ఇది కూడా చదవండి: Singareni Expansion Plans | సింగరేణి ఇతర రంగాలలోకి విస్తరించాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క