Bengal Cabinet Dissolved | బెంగాల్​ మంత్రివర్గాన్ని రద్దు చేసిన గవర్నర్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bengal Cabinet Dissolved | బెంగాల్‌ కేబినెట్‌ను గవర్నర్‌ ఆర్​ఎన్​ రవి (Governor R.N. Ravi) గురువారం రద్దు చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం మమతా బెనర్జీ (Mamata Banerjee) రాజీనామా చేయకపోవడంతో నిర్ణయం తీసుకున్నారు. దీంతో శనివారం బెంగాల్‌లో బీజేపీ (BJP) ప్రభుత్వం కొలువుదీరనుంది.

బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్. రవి మంత్రివర్గాన్ని రద్దు చేశారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇకపై ఆ తూర్పు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగరు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 174లోని క్లాజ్ 2 కింద ఈ రద్దు అమలు చేస్తున్నట్లు గవర్నర్​ కార్యాలయం తెలిపింది.

Bengal Cabinet Dissolved | సీఎం ఎవరో..

బెంగాల్​లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఓట్ల దోపిడీ, ఈవీఎంల ట్యాంపరింగ్​తో కాషాయ పార్టీ గెలిచిందని టీఎంసీ అధినేత్రి ఆరోపించిన విషయం తెలిసిందే. తమ పార్టీని గద్దె దించడానికి ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కైందని, వారు “అనైతికంగా” గెలిచారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో గవర్నర్​ మంత్రివర్గాన్ని రద్దు చేశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీని ఆహ్వానించనున్నారు. అయితే సీఎంగా ఎవరు ఎన్నిక అవుతరానే దానిపై ఉత్కంఠ ఉంది. రేసులో సువేందు అధికారితో పాటు పలువురు ఉన్నారు.

దీనిని కూడా చదవండి : Tamil Nadu Crisis| గవర్నర్ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *