Disaster Mock Drill | విపత్తుల సన్నద్ధతపై మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Shashi kiran Mottala

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Disaster Mock Drill | ప్రకృతి విపత్తులు (natural disasters), వరదలు సంభవించిన సమయాల్లో చేపట్టాల్సిన తక్షణ చర్యలపై (emergency response) ఈనెల 18న మాక్ ఎక్సర్​సైజ్(mock exercise)​ నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్​ కిరణ్​కుమార్​ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్​లో (Nizamabad Collectorate) జిల్లాస్థాయి అధికారులతో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

Disaster Mock Drill | మాక్​డ్రిల్​ నిర్వహణకు..

అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తులు (flood preparedness) సంభవించిన వెంటనే చేపట్టాల్సిన తక్షణ చర్యలపై అదనపు కలెక్టర్​ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాక్ డ్రిల్‌ను పక్కాగా నిర్వహించాలని సూచించారు. విపత్తులు, వరదలు, ఊహించని రీతిలో ప్రమాదాలు జరిగిన సమయంలో స్పందించే విధానంపై.. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై 18న అధికారులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

గతేడాది భారీ వర్షాలు కురిసిన సందర్భంగా జిల్లాలో పలు గ్రామాలు వరద ప్రభావానికి లోనయ్యాయని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు మళ్లీ ఏర్పడితే వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని, ముంపు ప్రాంతాల ప్రజలను కాపాడుకోవడంలో మాక్​ డ్రిల్​ ఉపయోగపడుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్​లో ఆర్డీవో రాజేంద్ర కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Paddy Procurement Transport | లారీలు అందుబాటులో ఉంచాలి.. ధాన్యం కొనుగోళ్లపై కీలక ఆదేశాలు

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *