Nizamabad Collectorate | కలెక్టరేట్​లో కలకలం.. మహిళ ఆత్మహత్యాయత్నం..

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad Collectorate | నిజామాబాద్​ కలెక్టరేట్​ ఆవరణలో (Collectorate Nizamabad) ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని.. ఇప్పటికే ముగ్గురు కలెక్టర్లకు విన్నవించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్త చేసింది. దీంతో మనస్థాపానికి గురైన సదరు మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Nizamabad Collectorate | పోలీసులకు ఫిర్యాదు చేసినా..

ఈ సందర్భంగా ఆలూరు(Alur) మండలం టేకంపల్లికి చెందిన మహిళ చిన్మల నల్లా మాట్లాడుతూ.. ఎస్సీ కులానికి చెందిన మాతో కొన్నేళ్ల క్రితం మా ఇంటి పక్కనే ఉన్నవారు అనవసరంగా గొడవ పెట్టుకున్నారన్నారు. ఈ గొడవలో మాదే తప్పుగా భావించిన కులం సభ్యులు మమ్మల్ని కులం నుంచి బహిష్కరించారని పేర్కొన్నారు. అప్పటినుంచి తమను కుల సమావేశాలకు రానివ్వట్లేదని.. ఏ కార్యానికి పిలవట్లేదని వాపోయింది. ఈ విషయమై మాక్లూర్ ​(Makloor) పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు ఇచ్చామని తెలిపింది. అయితే ఫిర్యాదు ఇచ్చినా మాపైనే తిరిగి కేసు పెట్టిన పోలీసులు కోర్టుకు పంపారని ఆవేదన వ్యక్తం చేసింది.. ఎన్నోసార్లు కలెక్టర్​ (Collector) ఆఫీసుకు వచ్చామని.. ఇప్పటికే ముగ్గురు కలెక్టర్లకు ఫిర్యాదు చేశామని అయినా ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ఈ క్రమంలో ఆమె సోమవారం కలెక్టరేట్​కు వచ్చిన ఆమె పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఇది కూడా చదవండి: TVK Election Results | తమిళనాడులో టీవీకే తుఫాన్.. విజయ్ పార్టీ సునామిని ముందుగానే ఊహించిన ఏకైక ఎగ్జిట్ పోల్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *