జాతీయం Bengal BJP Rise | బెంగాల్​లో కమల వికాసం.. బీజేపీ విజయానికి కారణాలివే..

 Bengal BJP Rise | బెంగాల్​లో కమల వికాసం.. బీజేపీ విజయానికి కారణాలివే..

పశ్చిమ బెంగాల్​లో కమలం వికసించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bengal BJP Rise | పశ్చిమ బెంగాల్​లో కమలం వికసించింది. అసెంబ్లీ ఎన్నిక (Assembly Election)ల్లో మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార పీఠం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

బెంగాల్​లో అడుగు పెట్టాలని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. 2021లోనే అధికారం దక్కించుకోవాలని తీవ్రంగా శ్రమించింది. అయితే ఆ ఎన్నికల్లో బెంగాల్​ ప్రజలు మమతకు పట్టం కట్టారు. కీలకమైన బెంగాల్​లో విజయం కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారు. 2016 ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు సీట్లలో మాత్రమే విజయం సాధించింది. అనంతరం ఆ పార్టీ టీఎంసీ నాయకుడు సువేంద్​ అధికారిని తన పార్టీలో చేర్చుకుంది. గత ఎన్నికల్లో 77 సీట్లలో బీజేపీ గెలుపొందింది. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా మారింది. నాటి నుంచి 2026 ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ నాయకులు శ్రమించారు. ఈ మేరకు తాజాగా కాషాయ జెండాను బెంగాల్ గడ్డపై ఎగురవేశారు.

Bengal BJP Rise | 193 స్థానాల్లో లీడ్​

బెంగాల్​లో 293 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 193 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఎంసీ 96 చోట్ల లీడ్​లో ఉంది. మమత బెనర్జీ (Mamata Banerjee) ఓడిపోవాలని చాలా మంది కోరుకున్నారు. ఈ ఓటమితో టీఎంసీ పని ఖతం అయినట్లేనని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్​ పార్టీ (Congress Party) 1975లో బెంగాల్​లో ఓడిపోయింది. ఆ తర్వాత మళ్లీ అధికారంలోకి రాలేదు. అప్పటి నుంచి 2011 వరకు కమ్యూనిస్ట్​లు బెంగాల్​ను ఏలారు. కమ్యూనిస్ట్​ల పాలనను మమత బెనర్జీ అంతం చేశారు. 15 ఏళ్లు ఆమె ముఖ్యమంత్రిగా పని చేశారు. 2011 తర్వాత బెంగాల్​లో కమ్యూనిస్ట్​ల ప్రభావం కోల్పోయారు. తాజాగా మమత బెనర్జీ ఓడిపోవడంతో ఆ పార్టీ పని అయిపోయినట్లేనని బీజేపీ నాయకులు (BJP Leaders)పేర్కొంటున్నారు. మమత బెనర్జీ ప్రస్తుతం 71 ఏళ్లు. ఆమెకు వారసులు లేరు. రానున్న రోజుల్లో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Bengal BJP Rise | పక్కా ప్రణాళికతో..

బెంగాల్​లో గెలుపు కోసం బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లింది. బీహార్​లో విజయం అనంతరం మోదీ (Modi) మాట్లాడుతు.. తర్వాత బెంగాల్​ అని ప్రకటించారు. మమత బెనర్జీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. ముఖ్యంగా ఆమె ఓ వర్గం ఓటర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బీజేపీపై కోపంతో యాంటీ హిందు స్టాండ్​ తీసుకున్నారు. దీనిని బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లగలిగింది. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ బీజేపీలో గెలుపు కోసం పని చేశారు. ఆర్​ఎస్​ఎస్, ఏబీవీపీ నాయకులు సైతం తీవ్రంగా శ్రమించారు. మమత బెనర్జీ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్​ నుంచి వచ్చిన అక్రమ వలసదారులకు ఆమె మద్దతు తెలిపారు. ఇప్పటికే ఉద్యోగాలు, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న స్థానిక యువతకు ఇది ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో వారు బీజేపీకి ఓటు వేశారు.

ఇది కూడా చదవండి..: TVK Election Results | తమిళనాడులో టీవీకే తుఫాన్.. విజయ్ పార్టీ సునామిని ముందుగానే ఊహించిన ఏకైక ఎగ్జిట్ పోల్

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Armoor Municipal Commissioner | ఆర్మూర్​ మున్సిపల్ కమిషనర్​గా శ్రీహరి రాజు

అక్షరటుడే ఆర్మూర్ : Armoor Municipal Commissioner | ఆర్మూర్ మున్సిపల్...

Political Earthquake | బ్లడీ హెల్.. ఇది రాజకీయ భూకంపం! ఐదు రాష్ట్రాల కౌంటింగ్ ట్రెండ్స్‌పై సీఎం ఒమర్ అబ్దుల్లా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Political Earthquake | దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన...

Dalit Ratna award | నిరంజన్​ రాజ్​కు ‘దళిత రత్న’ అవార్డు ప్రదానం

అక్షరటుడే, ఇందూరు : Dalit Ratna award |  హైదరాబాద్​లోని రవీంద్ర...

India Assembly Election Shocks| ఒకే దెబ్బకు ముగ్గురు సీఎంలు ఔట్? ఐదు రాష్ట్రాల ఫలితాల్లో పొలిటికల్ సునామీ!

అక్షరటుడే వెబ్‌డెస్క్:India Assembly Election Shocks| ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల...