Private Hospitals Approval | తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. 8 వేల ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Private Hospitals Approval | తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 8 వేల కొత్త ప్రైవేట్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం తాత్కాలిక అనుమతులు ఇచ్చింది.

రాష్ట్రంలో 8 వేల కొత్త ప్రైవేట్ ఆసుపత్రుల ప్రారంభానికి తాత్కాలిక అనుమతిని మంజూరు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వును జారీ చేసింది. అవసరమైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే తాత్కాలిక ధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని, సమగ్ర తనిఖీ అనంతరం శాశ్వత ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తామని వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అరుణ్‌రాజ్ (Minister Arunraj) పేర్కొన్నారు.

Private Hospitals Approval | నాణ్యమైన వైద్య సేవలు

వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రులకు వచ్చే ప్రజలను గౌరవంతో ఆదరించాలని, వారికి అవసరమైన సేవలను తక్షణమే అందించాలని సూచించారు. “కాయకల్ప” నాణ్యతా ధృవీకరణకు సంబంధించిన తనిఖీలను వార్షిక ప్రాతిపదికన కాకుండా, ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో 8 వేల ప్రైవేట్​ ఆస్పత్రులకు తాత్కాలిక అనుమతులు ఇస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి..:Kerala Assembly Speaker|కేరళ శాసనసభ స్పీకర్‌గా సీనియర్ కాంగ్రెస్ నేత తిరువంచూర్ రాధాకృష్ణన్ ఎన్నిక

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *