Tiger Shroff | టైగర్​ ష్రాఫ్​పై హత్యాయత్నం.. గన్స్​ అందించిన మహిళలు

బాలీవుడ్ నటుడు టైగర్​ ష్రాఫ్​పై హత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్​ ష్రాఫ్​పై హత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనపై కాల్పులు జరిపిన నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి గన్స్​ అందించిన మహిళలను తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

నటుడు టైగర్ ష్రాఫ్‌పై ముంబైలో ఆదివారం సాయంత్రం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు (Delhi Police) నలుగురిని అరెస్ట్ చేశారు. వీరు లారెన్స్​ బిష్ణోయ్ ముఠాతో సంబంధం ఉన్న వారని తెలిపారు. నిందితులను కునాల్, సుమిత్, రాధ, బబితగా గుర్తించారు. కునాల్, సుమిత్ హర్యానాలోని సోనిపట్‌కు చెందినవారు కాగా, రాధ, బబిత ఉత్తరప్రదేశ్‌ వాసులు. కునాల్ ఆదేశాల మేరకు రాధ, బబిత ఈ దాడికి ఉపయోగించిన ఆయుధాలను ముంబైకి తరలించి, నిందితులకు అందజేశారు. నలుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు ముంబై పోలీసులకు అప్పగించారు.

Tiger Shroff | జైలు నుంచి విడుదలయ్యాక..

కునాల్​ ఓ కేసులో జైలుకు వెళ్లి విడుదల అయ్యాడు. అనంతరం అతడికి అనిల్ పండిట్‌తో పరిచయం ఏర్పడింది. అనిల్ పండిట్ సూచన మేరకు, కునాల్ అమృత్‌సర్ నుంచి ఒక పిస్టల్‌ను, 20 తూటాలను తీసుకొచ్చాడు. రెండు నెలల క్రితం కునాల్ రాధను కలిసి తన కార్యకలాపాల గురించి వివరించి, ఆ ఆయుధాన్ని ముంబైకి తరలించేలా ఆమెను ఒప్పించాడు. అక్టోబర్ 15న కునాల్ రాధా, బబితలను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో దింపాడు. వారు పిస్టల్​ను తీసుకొని ముంబైకి వచ్చారు. అక్టోబర్ 17న వారు ముంబైలోని ఓ హోటల్​కు రాగా.. ఒక బాలుడు రాధా నుంచి గన్​ ఉన్న బ్యాగ్​ తీసుకు వెళ్లాడు.

ఇది కూడా చదవండి..: India-US Trade Deal | త్వరలో భారత్​–అమెరికా వాణిజ్య ఒప్పందం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *