అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులను ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్‌తో సన్నిహితంగా ఉండటం కాదన్నారు. సామాన్య ప్రజలతో బాధ్యతతో మెలగాలని సూచించారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పోలీసు అమరవీరులందరికీ నివాళులర్పించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అహర్నిశలు శ్రమిస్తూ, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. పోలీసు అమరవీరుల ధైర్యసాహసాలు, అంకితభావం, నిస్వార్థ సేవలు భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
CM Revanth Reddy | కుటుంబ సభ్యుల్లా చూడాలి
పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల్లో కుటుంబ సభ్యులను చూసుకోవాలని పోలీసులకు సీఎం సూచించారు. బాధ్యతతో వ్యవహరించాలన్నారు. మీ క్రమ శిక్షణే మీ బలం.. మీ నిజాయితే ఆత్మ గౌరవం అని సీఎం అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అమరుల స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లాలని సూచించారు. పోలీసుల అమరుల కుటుంబంలో అర్హులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం అందిస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Revanth Reddy Dasara Wishes | సీఎం రేవంత్‌రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలియజేసిన పీసీసీ చీఫ్