అక్షరటుడే, మెండోరా: SRSP Water Release | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriramsagar Project) నుంచి ప్రధాన కాలువలకు నీటి విడుదలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. వరద కాలువ ద్వారా పది రోజుల పాటు కొనసాగిన నీటి విడుదలను సైతం ఆపేశారు.
SRSP Water Release | తాగునీటికి ప్రాధాన్యం
వర్షాకాల పంటల సాగు కోసం గత మూడు నెలలుగా కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా కొనసాగించిన నీటి సరఫరాకు స్వస్తి పలికారు. ఈ విషయాన్ని ప్రాజెక్టు డీఈ గణేష్ వెల్లడించారు. 80 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 36 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. నిల్వ ఉన్న నీటిని మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు పేర్కొన్నారు. కాలువలకు నీటి విడుదల నిలిపివేయడంతో ఈ యాసంగి సీజన్‌లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి..: Kamareddy Dussehra Celebrations | ఆకట్టుకున్న లేజర్ షో.. రావణ దహనం.. ఇందిరాగాంధీ స్టేడియంలో విజయవంతంగా దసరా ఉత్సవాలు