Principal Murder Condemned | ప్రిన్సిపల్ హత్యపై విద్యాసంస్థల యాజమాన్యాల దిగ్భ్రాంతి.. రూపాదేవికి నివాళి

విద్యార్థులకు మంచి విద్య, సంస్కారం, మానవతా విలువలు అందిస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే గురువుపై ఇలాంటి దారుణానికి పాల్పడటం బాధాకరమన్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Principal Murder Condemned | నల్గొండ Nalgonda జిల్లా నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యను నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Principal Murder Condemned | కొవ్వొత్తులతో నివాళి..

నిజామాబాద్ నగరంలోని ఖలీల్‌వాడిలో ఉన్న అపూర్వ విద్యా సంస్థలో గురువారం (20-08-2025) విద్యాసంస్థల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హత్యకు గురైన ప్రిన్సిపల్ రూపారెడ్డి చిత్రపటానికి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా TREMA గౌరవ అధ్యక్షులు ఈగ శ్యాం సుందర్​రెడ్డి మాట్లాడుతూ.. ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్య ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. విద్యార్థులకు మంచి విద్య, సంస్కారం, మానవతా విలువలు అందిస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే గురువుపై ఇలాంటి దారుణానికి పాల్పడటం బాధాకరమన్నారు.

Action Against Scanning Centers | నిబంధనలు బేఖాతరు.. స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులపై కొరడా

Principal Murder Condemned | జ్ఞానాన్ని అందించే గురువులపై దాడులా..

విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాల్సిన గురువులపైనే దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు, సిబ్బందికి భద్రత కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.

సమాజానికి విలువలను బోధించే ఉపాధ్యాయుల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని విద్యాసంస్థల యాజమాన్యాల ప్రతినిధులు పేర్కొన్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment
  • ఎక్కడి కెలుతుంది దేశం ఏమైపోతుంది,నైతిక విలువలు లేని విద్య,లక్ష్యం గమ్యం లేని విద్యార్థులు,బాద్యతలేని తల్లిదండ్రులు,నీతి నియమాలు లేని తీరు.పౌర నియమాలు పాటించని సమాజం.వెరసి ఉపాధ్యాయులను-తోటి విద్యార్థులను తుదముట్టించే
    విద్యార్థులు (ముసుగులో) జాతికే కలంకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *