అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Action Against Scanning Centers | నిబంధనలను బేఖాతరు చేస్తూ వైద్య సేవలు అందిస్తున్న స్కానింగ్ సెంటర్లు, క్లినిక్‌లు, ఆస్పత్రులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కొరడా ఝళిపించారు.
నిజామాబాద్ Nizamabad జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ నేతృత్వంలోని బృందం నగరంలోని పలు వైద్య కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించింది. సంబంధిత యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Action Against Scanning Centers | పీటీఎస్ స్కానింగ్ సెంటర్‌లో లోపాలు..
బోధన్ Bodhan రోడ్డులోని పీటీఎస్ స్కానింగ్ సెంటర్‌ను తనిఖీ చేసిన అధికారులు ఓపీ రిజిస్టర్, ఫామ్-ఎఫ్ అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై డీఎంహెచ్‌వో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా నాన్‌మెడికల్ వ్యక్తుల ద్వారా రిఫరల్ ఫామ్‌లు జారీ చేయిస్తున్నట్లు గుర్తించడంతోపాటు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ నిబంధనలు పాటించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో కేంద్రానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
Action Against Scanning Centers | యునాని వైద్యుడి అల్లోపతి వైద్యం..
అహ్మద్‌పూర్ కాలనీలోని ఓ క్లినిక్‌లో యునాని వైద్యుడు సేవలు అందించాల్సి ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా అల్లోపతి వైద్యం అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై డీఎంహెచ్‌వో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా పిల్లల వైద్య నిపుణులు, స్త్రీ వైద్య నిపుణుల సేవలు అందుబాటులో ఉన్నాయంటూ ఏర్పాటు చేసిన బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వెంటనే తొలగింపజేశారు. అనంతరం సదరు క్లినిక్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చారు.
Action Against Scanning Centers | హయత్ ఆస్పత్రిలో 51 ఆపరేషన్లు..
బోధన్ రోడ్డులోని హయత్ ఆస్పత్రి తనిఖీల్లో మరిన్ని ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ఆస్పత్రిలో పార్కింగ్ ర్యాంప్ లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. వైద్యురాలు కావ్య ప్రత్యక్షంగా అందుబాటులో లేకపోయినా డిజిటల్ సైన్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఓపీ రిజిస్టర్‌ను అర్హతలేని వ్యక్తులతో రాయిస్తున్నట్లు తేలింది.
Harish Rao Letter Section 22A | 22A ల్యాండ్ కుంభకోణంపై హరీశ్ రావు ఫైర్..రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ
ముఖ్యంగా ఎంటీపీ రిజిస్టర్‌లో నమోదు చేయకుండానే మే 2025 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 51 ఆపరేషన్లు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై డీఎంహెచ్‌వో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ఆస్పత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
Action Against Scanning Centers | ఉల్లంఘనలపై కఠిన చర్యలు
వైద్య రంగంలో నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు. రిజిస్టర్ల నిర్వహణ నుంచి వైద్యుల అర్హతలు, రిఫరల్ విధానం, ఎంటీపీ రికార్డుల వరకు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఈ తనిఖీల్లో జిల్లా వైద్యాధికారితో పాటు ఏవో సుమంత్‌కుమార్, సుప్రియ, రామకృష్ణ, కీర్తన, డీహెచ్‌ఈ వేణుగోపాల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.