నిజామాబాద్ACB Trap | బోధన్​ ఠాణాలో ఏసీబీ సోదాల అప్​డేట్​.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై..

ACB Trap | బోధన్​ ఠాణాలో ఏసీబీ సోదాల అప్​డేట్​.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై..

బోధన్​ టౌన్​ ఎస్సై భాస్కరాచారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఓ వ్యక్తిని కేసులో ఇరికించకుండా ఉండటానికి ఎస్సై రూ.10 వేలు డిమాండ్​ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

అక్షరటుడే, బోధన్​: ACB Trap | బోధన్​ టౌన్​ ఎస్సై భాస్కరాచారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఓ వ్యక్తిని కేసులో ఇరికించకుండా ఉండటానికి ఎస్సై రూ.10 వేలు డిమాండ్​ చేసినట్లు ఏసీబీ అధికారులు (ACB Officers) తెలిపారు. అనంతరం దానిని రూ.7వేలకు తగ్గించాడు.

సదరు వ్యక్తి బంధువు ఈ విషయమై ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. బుధవారం స్టేషన్​లో ఎస్సైకి ఫిర్యాదుదారు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం పోలీస్​స్టేషన్​లో సోదాలు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

ACB Trap | గతంలో పలువురు ఎస్సైలు

ఉమ్మడి జిల్లాలో గతంలో పలువురు ఎస్సైలు ఏసీబీకి చిక్కారు. 2024 నవంబర్​లో.. ఓ కేసులో స్టేషన్‌ బెయిల్‌ కోసం రూ. 20వేలు లంచం తీసుకుంటూ వర్ని ఎస్సై కృష్ణకుమార్‌ అడ్డంగా దొరికిపోయాడు. 2024 నవంబర్​లో లింగంపేట ఎస్సై అరుణ్, రైటర్ రామస్వామి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. 2026 ఏప్రిల్​లో బిచ్కుంద సీఐ సత్యనారాయణ ఏసీబీకి దొరికాడు. కల్లుల దుకాణాల నిర్వహణకు సహకరించేందుకు ఆయన రూ.2 లక్షల లంచం అడిగాడు.

ACB Trap | వరుస దాడులు

ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఏసీబీ దాడులు (ACB Raids)పెరిగాయి. దీంతో అవినీతి అధికారులు ఆందోళన చెందుతున్నారు. సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాలు, ఆర్టీవో ఆఫీసుల్లో ఇటీవల సోదాలు చేశారు. గతంలో ఆర్టీవో చెక్​పోస్టులపై దాడులు చేశారు. అనంతరం ప్రభుత్వం వాటిని ఎత్తేసింది. ఇటీవల కామారెడ్డి మున్సిపల్​ కార్యాలయంలో అధికారులు సోదాలు చేశారు. ఏసీబీ దూకుడు పెంచడంతో అవినీతి అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తాము దొరికిపోతామోనని భయపడుతున్నారు.

ఇది కూడా చదవండి..: Deer Rescue | ఎస్సారెస్పీ బ్యాక్​ వాటర్​ వద్ద జింకపిల్ల లభ్యం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Traffic Restrictions Telangana| కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి రేవంత్ రెడ్డి కీలక ఆదేశం!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Traffic Restrictions Telangana| రాష్ట్రవ్యాప్తంగా తన కాన్వాయ్ లేదా ఇతర...

Telangana Nominated Posts | తెలంగాణలో నామినేటెడ్​ పదవుల భర్తీ..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Nominated Posts | తెలంగాణ (Telangana)లో నామినేటెడ్...

Crop Rotation Awareness | పంట మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి: పోచారం

అక్షరటుడే, బాన్సువాడ: Crop Rotation Awareness | పంట మార్పిడి విధానాలపై...

Minimum Pension Hike | కనీస పెన్షన్ రూ. 7,500.. పెంపు యోచనలో కేంద్ర ప్రభుత్వం!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Minimum Pension Hike | ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న...