Crop Rotation Awareness | పంట మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి: పోచారం

Shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Crop Rotation Awareness | పంట మార్పిడి విధానాలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) సూచించారు. మండలంలోని దేశాయిపేట గ్రామంలో బుధవారం రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోచారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Crop Rotation Awareness | రైతుల ఆదాయం తగ్గకుండా..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆదాయం తగ్గకుండా పంట మార్పిడి విధానాలపై వ్యవసాయ అధికారులు సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి అధిక దిగుబడుల దిశగా రైతులు అడుగులు వేయాలని కోరారు. సేంద్రియ ఎరువుల వినియోగంతో సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు.

ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ పద్ధతులను అనుసరించడం ద్వారా నేల ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు దీర్ఘకాలికంగా మెరుగైన దిగుబడులు సాధించవచ్చని పోచారం తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, ఖర్చు తగ్గించి లాభాలు పెంచుకునే మార్గాలను అన్వేషించాలని రైతులకు సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి రైతులకు సాంకేతిక సలహాలు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, సొసైటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: ACB Trap | ఏసీబీ వలకు చిక్కిన బోధన్​ ఎస్సై..

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *