Free Medical Camp | 20వ డివిజన్​లో ఉచిత వైద్య శిబిరం..

నగరంలోని 20వ డివిజన్​లో కాలనీవాసుల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Free Medical Camp | నగరంలోని (Nizamabad) 20వ డివిజన్​లో కాలనీవాసుల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరం (Health Checkup) ఏర్పాటు చేశారు. ఎల్లమ్మగుట్టలోని ఓ ప్రైవేట్​ ఫంక్షన్​ హాల్​లో కార్పొరేటర్​ న్యాలం సునీత రాజు ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు.

Free Medical Camp | 400 మందికి పైగా..

ఈ సందర్భంగా డివిజన్​లోని సుమారు 400మందికి పైగా ప్రజలు ఈ ఉచిత శిబిరంలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు వారికి కంటి వైద్యం, బీపీ, రక్తపరీక్షలు, టీబీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. డివిజన్​ ప్రజల కోసం కార్పొరేట్​ న్యాలం సునీత రాజు ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, గంగాధర్, మిట్టు గంగాధర్, సాగర్, వైద్యురాలు కీర్తి, వైద్యుడు చైతన్య, డిప్యూటీ డీఎంహెచ్​వో సికిందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

gopal1

ఇది కూడా చదవండి: Mohan Bhagwat Gen Z | వాళ్లు దేశ వ్యతిరేకులు కారు.. ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *