Voter Verification | సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూడాలి: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా కోల్పోకుండా బీఆర్​ఎస్ ​నాయకులు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Voter Verification | కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా కోల్పోకుండా బీఆర్​ఎస్ ​నాయకులు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ సూచించారు. శనివారం మాచారెడ్డి మండల (Machareddy Mandal) బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల నాయకులు, బీఎల్ఏలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Voter Verification | గ్రామాల్లో ఓట్లు భద్రంగా..

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి ఒక్కరి ఓటు భద్రంగా ఉండేలా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని గంప గోవర్ధన్​ సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు జరుగుతున్న ఓటర్ ప్రక్షాళన ప్రక్రియను సీరియస్​గా తీసుకోవాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని 267 బూత్​లలో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని, డిజిటల్ ప్రక్రియ పూర్తయ్యేవరకు పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఒకవేళ ఎవరి ఓటైనా తొలగిపోతే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. మాచారెడ్డి మండలంలోని అన్ని గ్రామాల్లో 90 శాతానికి పైగా ఓటర్ ప్రక్రియ పూర్తయిందని, పట్టణ ప్రాంతాల్లో మాత్రం కొంత నెమ్మదిగా సాగుతోందని చెప్పారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు పగడాల బాలచంద్రం, నాయకులు పొన్న శ్రీకాంత్ రెడ్డి, అంజి నాయక్, బూస శ్రీనివాస్, బట్ట రమేష్, తోకల కిషన్, అబ్దుల్ ఖాన్, శ్రీశైలం, శంకర్ బాబు, నవీన్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఏజాజ్, దేవరాజు, మహేష్​తో పాటు వివిధ గ్రామాల బూత్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: High Court Judges | హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *