అక్షరటుడే వెబ్‌డెస్క్: Priyanka Gandhi Reaction | కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఇది పూర్తిగా భారత దేశ ( India ) యువత సాధించిన విజయమని ఆమె అభివర్ణించారు. వయనాడ్ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని దెబ్బతీయాలని చూసేవారి నుంచి, ప్రజల గొంతు నొక్కడానికి ప్రయత్నించే వారి నుంచి దేశ ప్రజలు తమ హక్కులను తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించిన రోజుగా ఇవాళ్టి రోజు నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.
Priyanka Gandhi Reaction | శాయశక్తులా ప్రయత్నించాం..
కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థులకు ఎప్పుడూ బలమైన మద్దతుగా నిలిచామని ప్రియాంక గాంధీ తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యావ్యవస్థ సంస్కరణలపై రాహుల్ గాంధీ గత రెండేళ్లుగా నిరంతరం గళం వినిపిస్తున్నారని గుర్తుచేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ శ్రేణులు, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్‌లను సమాయత్తం చేసి దేశవ్యాప్తంగా ఉద్యమం నడిపించామని చెప్పారు. ఈ వార్త విన్నప్పుడు తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని అన్నారు.
Priyanka Gandhi Reaction | ప్రశ్నించే వారిపై బలప్రయోగం..
గత పదేళ్లలో దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి యువత ఎప్పుడు మేల్కొంటుందని తాను ఎన్నోసార్లు మదనపడ్డానని ప్రియాంక తెలిపారు. విద్యా వ్యవస్థను తమ సిద్ధాంతాలతో నింపేస్తూ, ప్రశ్నించే వారిపై బలప్రయోగం చేస్తున్నారని విమర్శించారు. అయితే, ఎట్టకేలకు దేశ యువత మేల్కొని చేపట్టిన పోరాటం ఫలించిందని, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: KITW | కేఐటీడబ్ల్యూలో ‘ఏడబ్ల్యూఎస్ స్టూడెండ్ బిల్డర్ గ్రూప్’ ప్రారంభం