అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stalin Security | తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌కు భద్రత కుదిస్తూ టీవీకే (TVK) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జడ్ ప్లస్ కేటగిరి నుంచి జడ్ కేటగిరికి ఆయన సెక్యూరిటీని తగ్గించారు. గతంలో ఉన్న 58 మంది భద్రత సిబ్బందిని 33కు కుదించారు.
రాజకీయ నాయకులు ఎదుర్కొంటున్న ముప్పులపై జరిపిన సమీక్షల ఫలితంగా ఎం.కె. స్టాలిన్ (M.K Stalin) భద్రతను తగ్గించినట్లు అధికారులు తెలిపారు. సచివాలయంలోని కోర్ సెల్ సెక్యూరిటీ వింగ్ జరిపిన సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. సెక్యూరిటీ తగ్గించిన ఆయనకు గణనీయమైన పోలీసు భద్రత కొనసాగుతుందని తెలిపారు. స్టాలిన్ కాన్వాయ్‌లోని ముందు, మధ్య, వెనుక భాగాలలో భద్రతా బృందాలను మోహరిస్తామని పేర్కొన్నారు. ప్రయాణ, బహిరంగ కార్యక్రమాల సమయంలో భద్రత కల్పించేందుకు పైలట్, ఎస్కార్ట్, బ్యాకప్, క్లోజ్-ప్రొటెక్షన్ వాహనాలు ఉంటాయన్నారు.
Stalin Security | కమిటీ నిర్ణయం మేరకు..
ఈ మార్పును భద్రతను ఉపసంహరించుకోవడంగా కాకుండా, భద్రతా మోహరింపును హేతుబద్ధీకరించడంగా అధికారులు అభివర్ణించారు. తమిళనాడులో వీఐపీలకు అందించే భద్రతను ప్రతి ఆరు నెలలకు ఒకసారి పునఃసమీక్షిస్తారు. ఈ ప్రక్రియలో నిఘా నివేదికలు, ముప్పుల స్వభావం, తక్షణ తీవ్రత, ప్రజల్లో వారి సంచారం, ప్రయాణ సరళి రక్షణ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటారు. కమిటీ పరిశీలనల ఆధారంగా ఒక భద్రతను కొనసాగించాలా లేదా అని నిర్ణయిస్తారు. ఈ మేరకు తాజాగా స్టాలిన్ భద్రతను తగ్గించారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ ఎమ్మెల్యేగా సైతం ఓడిపోయిన విషయం తెలిసిందే.
దీనిని కూడా చదవండి : GAIL Gas Leak | గెయిల్ పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్.. ఎక్స్‌ప్రెస్ వేపై ట్రాఫిక్ మళ్లింపులు