GAIL Gas Leak | గెయిల్​ పైప్​లైన్​ నుంచి గ్యాస్​ లీక్​.. ఎక్స్​ప్రెస్​ వేపై ట్రాఫిక్​ మళ్లింపులు

మహారాష్ట్రలోని సంభాజీనగర్ జిల్లాలో GAIL పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : GAIL Gas Leak | మహారాష్ట్రలోని సంభాజీనగర్ జిల్లా గంగాపూర్ తాలూకాలోని తక్లీవాడి సమీపంలో ఉన్న GAIL పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది. దీంతో శనివారం సాయంత్రం సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే (Samruddhi Express Way)పై 24 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ను అధికారులు మళ్లించారు.

ఎక్స్‌ప్రెస్‌వే పక్కనే ఉన్న తక్లీవాడి వద్ద సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గ్యాస్​ లీక్​ అవుతున్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. GAIL అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక పరికరాలను సిద్ధంగా ఉంచారు. అంతేగాకుండా సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేలోని చైనేజ్ 447 మరియు 470 మధ్య రాకపోకలను నిషేధించారు. వాహనాలను ధూలే-సోలాపూర్ హైవే వైపు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్​ రద్దీ అధికంగా ఉంది.

GAIL Gas Leak | వాల్వ్​లు మూసివేత

పైప్‌లైన్‌లోని ప్రభావిత ప్రాంతానికి ఇరువైపులా ఉన్న వాల్వ్‌లను GAIL నిపుణులు మూసివేశారు. దీంతో పైప్‌లైన్ లోపల ఒత్తిడి క్రమంగా తగ్గుతోందని అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, వీలైనంత త్వరగా సాధారణ ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Guruvayur Temple Weddings | ఆలయంలో ఒకేసారి 372 జంటల వివాహం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *