అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gangster Encounter | జార్ఖండ్ (Jharkhand)లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లలో ఒకడైన సుజిత్ సిన్హా ఎన్కౌంటర్లో హతం అయ్యాడు. సాహిబ్‌గంజ్ డివిజనల్ జైలు నుంచి ధన్‌బాద్ జైలుకు తరలిస్తుండగా అతడు తప్పించుకునే యత్నం చేశాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో మృతి చెందాడు.
Gangster Encounter | పోలీసులపై కాల్పులు
పోలీసుల కథనం ప్రకారం, జైలు బదిలీ సమయంలో జామ్తారా సరిహద్దు సమీపంలో ఈ ఘటన జరిగింది. టాయిలెట్‌కు వెళ్లడానికి కాన్వాయ్‌ను ఆగాలని సిన్హా కోరినట్లు అధికారులు తెలిపారు. పోలీసు వాహనం ఆగగానే సుజిత్ ఎస్కార్ట్ సిబ్బందిలో ఒకరి వద్ద నుంచి రైఫిల్‌ను లాక్కుని పారిపోయేందుకు యత్నించాడు. అంతేగాకుండా పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో అధికారులు ఎదురు కాల్పులు జరపగా.. సిన్హాకు తీవ్రమైన బుల్లెట్ గాయాలు అయ్యాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Gangster Encounter | 60కి పైగా కేసులు
సుజిత్ సిన్హాపై 60కి పైగా కేసులు ఉన్నాయి. హత్య, బలవంతపు వసూళ్లు, ఆయుధాల అక్రమ రవాణా, ఆయుధ చట్టం ఉల్లంఘనలు, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసులు అతడు నిందితుడిగా ఉన్నాడు. గతంలో దివంగత గ్యాంగ్‌స్టర్ సుశీల్ శ్రీవాస్తవ ముఠాతో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత సొంత ముఠాను ఏర్పాటు చేసుకుని, జార్ఖండ్‌లోని పలు జిల్లాల్లో బలవంతపు వసూళ్లు, నేర కార్యకలాపాలను నిర్వహించాడు. చాలా కాలంగా పోలీసులకు సవాల్‌గా మారిన అతడిని గతంలోనే అరెస్ట్ చేశారు. తాజాగా ఎన్కౌంటర్లో సిన్హా చనిపోయాడు.
ఈ ఘటన జరిగిన వెంటనే, సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన సంఘటనల క్రమాన్ని సమీక్షించడంతో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సీల్ చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా, రాత్రి 10 గంటల నుండి సాహిబ్‌గంజ్-గోవింద్పూర్ హైవేపై ట్రాఫిక్‌ను మళ్లించారు. సోమవారం ఉదయం దర్యాప్తు ప్రక్రియ పూర్తయ్యే వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఇది కూడా చదవండి..: Brij Bhushan Acquitted | రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఊరట