Brij Bhushan Verdict | వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి : బ్రిజ్ భూషణ్​

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Brij Bhushan Verdict | తనకు ఉరిశిక్ష పడాలని కోరుకున్నవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని బీజేపీ మాజీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అన్నారు. రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో కోర్టు ఆయనను నిర్ధోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిజ్​ భూషణ్​ మీడియాతో మాట్లాడారు.

బ్రిజ్​ భూషణ్​ (Brij Bhushan)పై పలువురు భారతీయ రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో రౌస్ అవెన్యూ జిల్లా కోర్టు సోమవారం ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. 2023లో వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా వంటి ప్రముఖ రెజ్లర్లు సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ నిరసన తెలిపారు. తాజాగా ఆ కేసులో కోర్టు బ్రిజ్​ భూషణ్​ను నిర్దోషిగా తేల్చింది. దీంతో ఆయన మాట్లాడుతూ.. ఈ తీర్పు తనకు, తన మద్దతుదారులకు సంతోషకరమైన క్షణమని పేర్కొన్నారు. తన న్యాయవాదుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంపై తదుపరి వ్యాఖ్యలు చేసే ముందు కోర్టు పూర్తి తీర్పు కాపీ కోసం వేచి ఉంటానని చెప్పారు.

Brij Bhushan Verdict | అప్పుడే చెప్పా..

తనపై ఆరోపణలు వచ్చినప్పుడే.. ఏదైనా ఆరోపణ రుజువైతే నేను ఉరి వేసుకుంటానని చెప్పానని బ్రిజ్​ భూషణ్​ గుర్తు చేశారు. ఈ రోజు కోర్టు నిర్దోషిగా ప్రకటించిందన్నారు. తనకు ఉరిశిక్ష వేయాలని, సజీవ దహనం చేయాలని డిమాండ్లు వచ్చాయన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి..: Gangster Encounter | ఎన్​కౌంటర్​లో గ్యాంగ్​స్టర్​ హతం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *