అక్షరటుడే, బాల్కొండ: SRSP Flood Canal | కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోయడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sri Ram Sagar Project) వరద కాలువ జలకళ సంతరించుకుంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా నీటి విడుదల కొనసాగుతుండటంతో బాల్కొండ నియోజకవర్గ పరిధిలో వరద కాలువ కళకళలాడుతోంది.
SRSP Flood Canal | రాజేశ్వరరావు పేట పంప్‌హౌస్ నుంచి..

జగిత్యాల జిల్లాలోని రాజేశ్వరరావుపేట పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయడంతో ముప్కాల్ పంప్‌హౌస్ వరకు వరద వస్తోంది. సుమారు 30కిలోమీటర్ల మేర వరద కాలువలో సుమారు ఐదు మీటర్ల లోతు వరకు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద కాలువలో నీరు సమృద్ధిగా నిల్వ ఉండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడడంతో పాటు భూగర్భ జలాల మట్టం పెరగడానికి కూడా దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Sriramsagar Flood | శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద